తిరుపతిలోని ఉప్పరపల్లెకు చెందిన వనితావాణి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. తన ఇంటివద్ద ఉన్న గార్డెన్ ను గేదెలు ధ్వంసం చేయడంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మార్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. కంప్లైంట్ తీసుకోవాల్సిందిగా ఎస్సై ప్రకాష్ ను కోరగా తనపై దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.