దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇక దేశ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సంస్థ ఓనర్ రతన్ టాటాకు చెందిన కారు నంబర్ (ఎంహెచ్01 డికె 0111) ప్లేట్‌ను ఉపయోగించిన కారణంగా ముంబయి పోలీసులు ఓ మహిళపై కేసు నమోదు చేశారు. రతన్ టాటాకు చెందిన కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వచ్చిన ఈ-చలాన్లు టాటా సన్స్ ఆఫీసుకు వెళ్లాయి.