నేటి సమాజంలో చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి. ఇక కారణాలు లేని గొడవలకు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా పదిరూపాయల కోసం జరిగిన గొడవ గన్ తో బెదిరింపులకు దారి తీసింది. పోలీసుల ఎంట్రీతో విషయం సర్దుమణిగినా అసలు విషయం తెలిసి అందరూ షాకైయ్యారు.ఆంధ్రా ఊటి అరకులోయలో యువకులు గన్నుతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది.