దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలోని పింప్రీ చించ్వాడ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ 47 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... పింప్రీ చించ్వాడ్ ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల మహిళ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఓ పీడబ్ల్యూడీ ఇంజనీర్‌తో ఆమె చనువుగా ఉండేది.