దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. స్నేహం పేరుతో నమ్మించి ఓ ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చిన తర్వాత ఈ దారుణానికి తెగబడ్డారు. మూడ్రోజుల తర్వాత ఆ బాలికను వదిలేశారు కానీ, ఆమెపై బెదిరింపులను మాత్రం ఆపలేదు. ఆ బాలికనే కాదు, ఆ బాలిక తల్లిదండ్రులను కూడా వారు బెదిరించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.