పవన్ కళ్యాణ్ రెండుసార్లు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్లే ఉంది. మొదటిసారి దుబ్బాక ఉప ఎన్నిక. రెండోది తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికలు. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ రెండు ఎన్నికలకు పవన్ దూరంగానే ఉండిపోయారు.పవన్ కళ్యాణ్ అనుకోని కారణాలవల్ల దూరంగా ఉన్నా, రెండిటిలోనూ బీ జే పీ మంచి ఫలితాలను రాబట్టింది. దాంతో కమలం పార్టీ విజయాల్లో తన వంతు పాత్ర ఉందని చెప్పుకోవడానికి పవన్ కు వీలు లేకుండా పోయింది. దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేయాల్సిందిగా కమలం పార్టీ నేతలు రెండు సార్లు పవన్ ను అడిగారట. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అటు వైపు కూడా తొంగి చూడలేదట. అయితే ఏదో విధంగా మొత్తానికి అధికార పార్టీ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థి ఓడించారు.