త్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితులను పరామర్శించడానికి తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల పర్యటన గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చత్తీస్గడ్ ముఖ్యమంత్రి భూపేష్బాఘెల్, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి ఎస్ ఎస్ రాంధావాలా ప్రయాణిస్తున్న విమానాలను లక్నోలోని ఎయిర్‌ఫోర్ట్‌లో దిగేందుకు అనుమతించకూడదని ఎయిర్‌ఫోర్ట్ అధికారులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది