తెలంగాణాలో హుజూర్‌నగర్ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని తెలియచేసారు ప్రజలకి. తమ అభ్యర్థి సైదిరెడ్డి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది. ప్రజా కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించడం జరిగింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో విజయం తమలో మరింత సేవాభావాన్ని, అంకిత భావం పెరుగుతుంది అని తెలిపారు. 


హుజూర్‌నగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాలు కురి పించడం జరిగింది. నియోజకవర్గంలో గల 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులను కేటాయిస్తున్నానని ప్రకటన వెల్లడి చేశారు. 7 మండల కేంద్రాలకు రూ.30 లక్షలు అందజేస్తామని తెలిపారు. ఈ నిధులకు సంబంధించి రెండు, మూడురోజుల్లో జీవో కూడా విడుదల చేయిస్తాము అని తెలియచేసారు.


ఒక్క హుజూర్‌నగర్ పట్టణానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ తెలియచేసారు. నేరుడుచర్లకు కూడా రూ.15 కోట్లు అందిస్తామని పేర్కొన్నారు. హుజూర్ నగర్‌ను డివిజన్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. గిరిజనుల చిరకాల కోరిక తండాలను పంచాయతీలుగా మార్చింది మా ప్రభుత్వం  అని తెలియచేసారు. తమ హయాంలో 3 వేల తండాలు, గూడెలను ప్రభుత్వం పంచాయతీలుగా చేసిందని గుర్తుచేసారు. 


ఇక రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేయడం జరిగింది అని కేసీఆర్ చెప్పారు. కానీ హుజూర్‌నగర్‌లో లేదని.. ఇక్కడ తక్షణమే గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేస్తాము అని తెలిపారు.  మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో పోడుభూముల సమస్య ఉందని.. త్వరలోనే ప్రజాదర్బార్ పెట్టి అతి త్వరలోనే కార్యక్రమం చేపడతామని ప్రజలకు తెలియచేయడం జరిగింది. హుజూర్‌నగర్  నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలియచేయడం జరిగింది. ఇలా అన్ని సమస్యలకు కేసీఆర్  ప్రభుత్వం అండగా ఉంతుంది అని తెలియ చేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: