అందరి జీవితంలో పెళ్లి అనేది ఒక్క మరపురాని ఘట్టం. ఈ పెళ్ళి ఇద్దరిని ఒక్కటి చేస్తుంది. రెండు కుటుంబాల మధ్య సంబంధాలను ఏర్పడుతుంది. పెళ్లి మీద అమ్మాయికే కాదు అబ్బాయిలకు కూడా చాలా ఒప్స్ పెట్టుకుంటారు. పెళ్లి అనేది అమ్మాయి, అబ్బాయిల కొత్త జీవితానికి నాది పలుకుతుంది. వారి వైవాహిక జీవితం ఎలా ఉన్నా పెళ్లి తర్వాత ఇద్దరు ఒక్కటై జీవనం సాగించాలనుకుంటారు.పెళ్లి అంటే ఇంట్లో సందడి నెలకొంటుంది. ఇంట్లో అంతా బంధువులతో కళకళ లాడుతూంటుంది. కానీ నేటి సమాజంలో సంప్రదాయాల కంటే డీజేకే ఎక్కువ ప్రాధ్యానం ఇస్తున్నారు. మద్యం, డీజే లేకుండా ప్రస్తుతం జరగని పెళ్లంటూ లేదు. 

 

కొడుకు ఓ ఇంటివాడవుతున్న సందర్భంగా ఆ ఇంట్లో సందడే సందడి. వివాహ వేడుక సందర్భంగా ఇల్లంతా సంతోష సాగరంలో మునిగితేలుతోంది. పిల్లలు, పెద్దలు అన్న తేడా మరిచి ఎంజాయ్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తయింది. రాత్రికి పెళ్లి కొడుకు చనిపోయాడు. అప్పటి వరకు సందడికి కేరాఫ్‌ అనిపించిన ఇంటిని విషాదం చుట్టుముట్టేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం మేరకు...నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ పట్టణానికి చెందిన మంగళి గణేష్‌ (25)కు నిన్న మధ్యాహ్నం పెళ్లయింది.

 

రాత్రికి సంప్రదాయంలో భాగంగా ‘బారాత్‌’ నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి కొడుకు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. కానీ డీజే సౌండ్‌ను అతని గుండె తట్టుకోలేకపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై కుప్ప కూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 

అక్కడ చికిత్స పొందుతూ రాత్రి రెండు గంటల సమయంలో తుదిశ్వాస వదిలాడు. నూరేళ్లు తోడుంటానని బాసలు చేశాడు. కానీ విధి  కాసేపటి క్రితమే తన మెడలో మూడు ముళ్లు వేసిన  వ్యక్తి అంతలోనే అందని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ యువతి వేదన వర్ణనాతీతం. ఆ పెళ్ళికి వచ్చిన వారు పెళ్లికూతురిని చూసి కన్నీరుమున్నీరైయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: