ఏపీ ప్రభుత్వంపై తెలుగు అగ్రశ్రేణి దిన పత్రిక ఈనాడు అక్షర అస్త్రాలు సంధిస్తోంది. వరుస కథనాలతో జగన్ సర్కారును ఇరుకున పెడుతోంది. ప్రత్యేకించి రాజధాని మార్పు నిర్ణయం దగ్గర నుంచి ఈనాడు తన కలానికి మరింతగా పదును పెడుతోంది. వరుస కథనాలతో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు అనే దిశగా కథనాలు రాసుకొస్తోంది. రాజధాని మార్పు నిర‌్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఈనాడు.. ఒక విధంగా టీడీపీ కంటే బలంగా జగన్ సర్కారుపై యుద్ధం చేస్తోందనే చెప్పాలి.

 

jagan and ramoji కోసం చిత్ర ఫలితం

 

తాజాగా మరోసారి ఈనాడు జగన్ సర్కారుపై అక్షర దండయాత్ర చేసింది. మూడు రాజధానుల నిర్ణయంతో పెట్టుబడి దారులు పారిపోతున్నారంటూ ఓ కథనం ప్రముఖంగా ప్రచురించింది. గతంలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఓ చోదక శక్తిగా పని చేసిందని.. ఇప్పుడు జగన్ సర్కారు దీన్ని లేకుండా చేసిందని ఆరోపించింది. బ్రాండ్‌ ఇమేజ్‌ పనిని అమరావతి సమర్థంగా నిర్వహించిందని ఇప్పుడు అది లేకుండా పోయిందని రాసుకొచ్చింది.

 

jagan and ramoji కోసం చిత్ర ఫలితం

 

అమరావతికి వచ్చిన గుర్తింపుతో దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులకు రంగం సిద్ధమైన తరుణంలో జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోందని ఈనాడు తన కథనంలో పేర్కొంది. అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే.. ఏమేం జరిగేదో.. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చేవో చెబుతూ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అంతే కాదు.. ఇప్పుడు నిర్మాణదారులంతా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లిపోతున్నారని రాసుకొచ్చింది.

 

jagan and ramoji కోసం చిత్ర ఫలితం

 

 

3 రాజధానుల ప్రకటనతో పరిస్థితి తలకిందులైందని.. అమరావతి, చుట్టుపక్కల వస్తాయనుకున్న పెట్టుబడులు, ప్రాజెక్టుల్లో కొన్ని రద్దయ్యాయని ఈనాడు రాసింది. అయితే అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందన్న విషయాన్ని ఈనాడు పట్టించుకోలేదు. అయితే ఈనాడు కథనాలు రాయడం.. వాటిని వైసీపీ మంత్రులు తూర్పారపడుతున్నారు. మరి ఈ కథనంపై ఎలా స్పందిస్తారో చూడాలి. తెలంగాణలో కాస్త సంయమనం పాటిస్తున్న ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దూకుడు కొనసాగిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: