చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లో కొనసాగుతుండగా.. దాదాపు 350 కోట్ల మంది ప్రజల నిర్బంధంలోనే ఉన్నారు. వైరస్ నియంత్రణకు ఎన్ని క‌ఠ‌న చర్యలు చేపట్టినా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు 7, 85 , 775 కాగా,  మృతులు సంఖ్య 37, 815కు చేరింది. భార‌త్‌లో సైతం క‌రోనా రోజురోజుకు విజృభింస్తుంది. ఈ క్ర‌మంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఫీవర్ నెలకొంది. ఓ వైపు ప్రభుత్వం లాక్‌డౌన్‌తో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. 

 

ఇప్ప‌టికే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కి చేరుకుంది. మొదటలో ఈ సంఖ్య తక్కువగా ఉండేది. కానీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడం, కాంటాక్ట్ కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. సాంకేతికతను వాడుకొని అధునాతన పద్ధతులతో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేప‌థ్యంలోనే కొత్తగా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తెరమీదికి తీసుకొచ్చింది. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలను గుర్తించడానికి ఉద్దేశించిన సరికొత్త ట్రాకింగ్ సిస్టమ్ ఇది. 

 

దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. దాన్ని చాలా మంది పెడ‌చెవిన పెట్టి.. బాధ్య‌త‌ర‌హింత రోడ్ల‌పై తిరిగేస్తున్నారు. అందుకే హోమ్ క్వారంటైన్‌లో ఉండకుండా ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయాన్ని స్పష్టంగా తెలిపేలా దీన్ని తయారు చేశారు. ఒకేసారి 25 వేల మంది కదలికలను ఇది పసిగట్టగలదు. హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారి సెల్ ఫోన్ నంబర్‌కు అనుసంధానం చేస్తారు. 

 

వారు వినియోగించే ఈ సెల్‌ఫోన్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని సెల్ టవర్, సర్వీసు ప్రొవైడర్ల ద్వారా హోమ్ క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడతారు. కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ నిఘాలో ఉన్న కరోనా వైరస్ అనుమానితుడు తన ఇంటి నుంచి వంద మీటర్ల పరిధిని దాటి వెళ్తే వెంటనే ఆ సమాచారం ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా జిల్లా అధికారులకు మ‌రియు స‌మీప పోలీస్ స్టేషన్‌కు ఈ సమాచారాన్ని చేరుతుంది. దీంతో వెంటనే వారిపై క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇలా కరోనా అనుమానితులను ఇంటి నుంచి బయటకు పంపకుండా చేయవచ్చు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: