గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో లాక్ డౌన్ ను పొడిగిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) దేశంలో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని... అందువల్ల లాక్ డౌన్ ను పొడిగిస్తారని చెబుతున్నట్లు ఒక నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ నివేదిక వల్ల దినసరి కూలీలు, వ్యాపారులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నివేదికలో కేంద్రం కనీసం జూన్ నెలాఖరు దాకైనా లాక్ డౌన్ ను పొడిగించవచ్చని పేర్కొన్నారు. అయితే తమ పేరుతో నివేదిక వైరల్ అవుతూ ఉండటంతో బీసీజీ ఈ వార్తల గురించి స్పందించింది. తాము లాక్ డౌన్ పొడిగింపు గురించి ఎటువంటి అంచనాలు వెలువరించలేదని బోస్టన్ గ్రూప్ స్పష్టం చేసింది. 
 
సీఎం కేసీఆర్ నిన్న మీడియా ముందు మాట్లాడుతూ జూన్ 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తే మంచిదని బీసీజీ గ్రూప్ అభిప్రాయం వ్యక్తం చేసిందని చెప్పారు. ప్రధానికి కూడా ఈ నివేదిక గురించి చెబుతానని అన్నారు. అయితే బోస్టన్ గ్రూప్ వైరల్ అవుతున్న నివేదిక గురించి స్పష్టత ఇవ్వడంతో ఈ అంశం చర్చకు దారి తీస్తోంది. మరోవైపు మోదీ లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోదీ లాక్ డౌన్ ను ఎత్తివేసినా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: