భారత అసంఘటిత రంగంపై కొవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపుతోంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి అభిప్రాయం వ్య‌క్తం చేసింది. లాక్‌డౌన్ కార‌ణంగా నిరుపేద వ‌ర్గాలు, రోజూవారీ కూలీలుగా ప‌నిచేసే కోట్లాదిమంది భార‌తీయుల ప‌రిస్థితులు రోజురోజుకు ద‌య‌నీయంగా మారే ప‌రిస్థితులు ఉన్న‌ట్లు ఐరాస ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అసంఘ‌టిత రంగంలో దాదాపు 40 కోట్ల మంది ప‌నిచేస్తున్నార‌ని, లాక్‌డౌన్ కార‌ణంగా వీరంతా  మరింత పేదరికంలోకి జారుకోనున్నారని అభిప్రాయ‌ప‌డింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు వారందరి ఉపాధి ప్రమాదపుటంచులకు చేరిందని నివేదికలో పేర్కొంది.

 

ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్ ఫ‌లితంగా  భారత్‌లో రోజుకూలీలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రస్తావించింది. ప‌ట్ట‌ణాల నుంచి తిరిగి ప‌ల్లెల‌కు వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయ‌ని పేర్కొంది. 75 ఏళ్ల చరిత్రలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంతటి సంక్షోభ ఎదుర్కొలేద‌ని అన్నారు.  . ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ‘‘ఐఎల్‌ఓ మానిటర్‌: కొవిడ్‌-19 అండ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌’’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన అతిపెద్ద సంక్షోభంగా కరోనా మహమ్మారిని ఈ నివేదిక అభివర్ణించింది.  ఇదిలా ఉండ‌గా అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ప‌రిస్థితులు ఇదే విధంగా ఉన్నాయ‌ని పేర్కొంది.


ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19.50కోట్ల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గాయ్ రైడర్‌ అభిప్రాయపడ్డారు.  అయితే  కరోనా వల్ల అత్యంత భారీగా ప్రభావితమైన దేశాలకు అభివృద్ది చెందిన దేశాలు అండగా ఉండాల‌ని కోరింది.  వసతి, ఆహారం, ఉత్పత్తి, రిటైల్‌, వ్యాపార, పాలనా రంగాలపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ప్రతి ఐదుగురిలో నలుగురు ప్రభావితమయ్యారని తేల్చింది. అయితే భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకోవ‌డానికి అవ‌కాశాల‌ను కూడా నివేదిక‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. క‌రోనా బారి నుంచి త్వ‌ర‌గా దేశాలు కోలుకోవాల‌ని ఆకాంక్షించింది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: