దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ ను మరో మూడు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ లాక్ డౌన్ పొడిగింపు గురించి ప్రకటన చేయక ముందే కేంద్రం దేశవ్యాప్తంగా జిల్లాలను కరోనా తీవ్రతను బట్టి రెడ్ జోన్లు, ఆరంజ్ జోన్లు, గ్రీన్ జోన్లుగా ప్రకటించనుందని విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. ప్రధాని మోదీతో జగన్ మాట్లాడిన అనంతరం మూడు జోన్లు పెట్టాలని మోదీకి జగన్ ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. 
 
రెడ్ జోన్ లో ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేసి ప్రభుత్వమే నిత్యావసర వస్తువులను ఇళ్లకు సరఫరా చేస్తుంది. ఆరంజ్ జోన్లలో ఆంక్షలను కొంత సడలిస్తారు. గ్రీన్ జోన్లలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేస్తారని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. తెలుగుదేశం అనుకూల పత్రికలు కూడా జోనల్ వ్యవస్థను కేంద్రం దేశమంతటా తీసుకురాబోతుందని ప్రచారం చేసింది. 
 
అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ జోనల్ వ్యవస్థ పేరు చెప్పుకుని ఎన్నికలు జరుపుకోవడానికి నాటకాలు ఆడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్ ను ఆగమేఘాల మీద తీసుకొనిరావడం... ఆయన ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండండని వ్యాఖ్యలు చేయడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారని టీడీపీ ఆరోపణలు చేసింది. అయితే నిన్న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తానే జోనల్ వ్యవస్థ గురించి మోదీకి చెప్పానని అన్నారు. 
 
ఈ నెల పదో తారీఖునే రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ గురించి తాను మోదీకి లేఖ రాశానని మోదీ తాను రాసిన లేఖను పరిగణిస్తానని చెప్పారని మీడియాకు తెలిపారు. అయితే ఇప్పటికే కేరళ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ అమలులో ఉంది. ఈ జోనల్ వ్యవస్థ వల్లే కేరళ రాష్ట్రంలో మొదట్లో భారీగా కరోనా కేసులు నమోదైనా ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న మోదీ జోనల్ వ్యవస్థ గురించి ప్రకటన చేయకపోవడంతో జగన్ కు ఝలక్ అంటూ తెలుగుదేశం అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. చంద్రబాబు జోనల్ వ్యవస్థ గురించి తానే తానే మోదీకి చెప్పానని వ్యాఖ్యలు చేయడం గురించి మాత్రం పాజిటివ్ కథనాలు వచ్చాయి. మరి మోదీకి జోనల్ వ్యవస్థ గురించి చెప్పింది జగనా..? చంద్రబాబా...? అసలు ఈ జోనల్ వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందా...? రాదా...? తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: