ప్రపంచ దేశాల్లో కల్లా ఎక్కువగా యువత కలిగిన దేశం భారతదేశం. దేశంలో యువతలో ఉన్న ప్రగతి ఇప్పుడు దేశానికి కీలకంగా మారనుంది. కరోనా వైరస్ కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ యువతను భాగస్వామ్యం చేయాలని చూస్తోంది. ఈ వైరస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోవడంతో ఇటువంటి పరిస్థితుల్లో యువత సేవలు వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. వైరస్ ప్రభావం రోజురోజుకి తగ్గే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ ఆంక్షలను, సరికొత్త మార్గదర్శకాలను కేంద్రం సడలిస్తోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వివిధ రంగాల్లో తరలింపు కార్యక్రమాలు స్టార్ట్ చేసింది.

 

ఈ నేపథ్యంలో యువతను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం బలంగా ఆలోచిస్తున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత దేశ జనాభాలో 85% యువత కావటంతో ఎక్కువగా రోగ నిరోధక శక్తి యువతలో ఉండటంతో కరోనా వైరస్ సోకే అవకాశాలు తక్కువ కావటంతో కొన్ని కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం యువత ను రంగంలోకి దింపటానికి కార్యాచరణ సిద్ధం చేసిందట. కరోనా వైరస్ లేని చోట్ల ఆయా రంగాల్లో ఎక్కువగా యువత సామర్ధ్యాన్ని వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిందట.

 

ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడానికి రూపొందిస్తున్నారంట. వారి సేవలు వినియోగించుకుని భారతదేశం తిరిగి పుంజుకునేలా చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంమీద కరోనా వైరస్ తో నష్టపోయిన భారతదేశాన్ని భారతదేశ యువత శక్తితో పునర్నిర్మించడానికి కేంద్రం రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: