కరోనా లాక్ డౌన్‌ పుణ్యమా అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండి పోయారు. అక్కడి నుంచే రోజూ ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీ సర్కారు పని తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉత్త ప్రెస్ మీట్లు మాత్రమే కాదు.. జూమ్ యాప్ తో పార్టీ నాయకులతో వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహిస్తున్నారు. అంతే కాదు.. దేశ, విదేశాల్లోని ఎన్నారైలతో మాట్లాడుతూ తన అనుకూల మీడియాలో నిత్యం వార్తలు వచ్చేలా చేస్తున్నారు.

 

 

అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చేసినా అది ఎన్.టి.ఆర్.ట్రస్టు పేరునో.. లేక తెలుగు దేశం పార్టీ పేరుతోనో నిర్వహించేవారు. ఇప్పుడు కొత్తగా ఆయన నోట మరో కొత్త సంస్థ పేరు వినిపిస్తోంది.. అదే సీబీఎన్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ తరపున దేశ, విదేశాల్లోనూ తెలుగు వారితో మాట్లాడుతున్నాం.. వారిని ఆదుకునే ఆలోనచలు చేస్తున్నాం అని చంద్రబాబు చెబుతున్నారు.

 

 

అయితే.. ఈ సీబీఎన్‌ ఫౌండేషన్ పేరు ఇప్పుడే కొత్తగా వింటున్నాం.. ఈ కరోనా లాక్‌ డౌన్ తర్వాతే దీనిపేరు వినిపిస్తోంది. మరి ఇంతకీ ఈ సీబీఎన్ ఫౌండేషన్ ఎప్పుడు పెట్టారు. గోరంత పని చేసినా కొండంత ప్రచారం చేసుకునే చంద్రబాబు చడీచప్పుడు కాకుండా ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు. దీని విధివిధానాలు ఏంటి.. దీని ఆర్థిక మూలాలు ఏంటి.. అన్న విషయాలు మాత్రం ఇప్పటికి వెల్లడి కాలేదు.

 

 

గతంలో సీబీఎన్ ఆర్మీ పేరుతో ఎన్నికల ప్రచారంలోనూ.. ఆ తర్వాత కొందరు సందడి చేసేవారు. ఈ సీబీఎన్ ఆర్మీకి.. ఈ సీబీఎన్ ఫౌండేషన్ కూ ఏమైనా సంబంధం ఉందా.. ఇది కూడా టీడీపీ పార్టీ విభాగమా లేక.. చంద్రబాబు పేరుతో ఏర్పడిన సేవా సంస్థా.. ఈ విషయంపై టీడీపీ నుంచి క్లారిటీ వస్తే బావుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: