కొన్నిరోజుల క్రితం తెలంగాణ సీఎం నేరుగా ప్రెస్ మీట్‌లోనే ఆంధ్రజ్యోతి పత్రికకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఇంతగా కష్టపడుతుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి పిచ్చిరాతలు రాస్తారా అంటూ నేరుగా కేసీఆర్ హెచ్చరించారు. మిమ్మల్ని ఏమాత్రం వదిలిపెట్టను మీ సంగతి చూస్తా.. కేసీఆర్ తలచుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ చాలా ఘాటుగా స్పందించారు.

 

 

అయితే నేరుగా కేసీఆర్ ఫైర్ అయ్యేసరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా అదే స్థాయిలో కాకపోయినా దీటుగానే స్పందించాడు. బరాబర్ రాస్తాం.. ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు అనే రేంజ్‌ లో తన కొత్త పలుకు శీర్షిక ద్వారా బదులిచ్చాడు. రాస్తాం.. ఏం చేస్తావో చేసుకో అని బదులు ఇచ్చినా.. తెలంగాణ విషయానికి వచ్చే సరికి వార్తల ఎంపిక, ప్రజంటేషన్‌లో కాస్త బాగానే జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తోంది.

 

 

కేసీఆర్‌తో ఎందుకొచ్చిన గొడవ అన్న ఫీలింగ్ ఓవైపు.. గతంలో కేసీఆర్ తో గొడవ పెట్టుకుని ఎంత నష్టపోయిందో గుర్తొచ్చి కావచ్చు.. తగిన జాగ్రత్తలతోనే కేసీఆర్ ను నొప్పించకుండా అన్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే అదే ఏపీ విషయానికి వచ్చేసరికి జగన్ సర్కారుపై ఆంధ్రజ్యోతి దూకుడు మాత్రం తగ్గలేదు. అక్కడ ఉన్నది తనకు ఏమాత్రం గిట్టని సర్కారు కాబట్టి ఆ ప్రజంటేషన్ ఆ స్టయిల్ పూర్తిగా వేరుగా ఉంటోంది.

 

 

చివరకు ఒకే తరహా విషయం చెప్పేటప్పుడు కూడా తెలంగాణ ఒకలా.. ఆంధ్రలో ఒకలా ప్రజంట్ చేసే విషయంలో ఆంధ్రజ్యోతి తన మార్కు చూపించుకుంటోంది. ఏపీలో కేసులు ఎక్కువగా వస్తే.. ఒకే రోజు 80 కేసులు అని హెడ్డింగ్ పెడతారు. అదే తెలంగాణలో అయితే కేసుల సంఖ్య ఇంపార్టెంట్ కాదన్నట్టు.. రోజుకు వెయ్యి పరీక్షలు అంటూ హెడ్డింగ్ పెడతారు. ఏపీలో అంతకంటే ఎక్కువ పరీక్షలు చేస్తున్నా దాన్ని పట్టించుకోరు. అది వార్తా కోణం కాదు.

 

అలాగే.. ఏపీలో బతుకు లాక్ డౌన్ కేసులకు ఏదీ డౌన్ అంటూ నిలదీస్తారు. అదే తెలంగాణ విషయానికి వచ్చే సరికి.. కట్టడికి 28 రోజలు అంటూ సాఫ్ట్‌ గా రాస్తారు. ఇవి మచ్చుకు ఒకరోజు ఉదాహరణలు మాత్రమే. మొత్తానికి కేసీఆర్ వార్నింగ్‌తో రాధాకృష్ణ కాస్త దారికి వచ్చినట్టు కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: