ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అతి త‌క్కువ స‌మ‌యంలోనే రాజ‌కీయంగా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక సీఎం అయిన 10 నెల‌ల్లోనే జ‌గ‌న్ అటు రాజ‌కీయంగాను.. ఇటు పాల‌నా ప‌రంగాను ఎన్నో సంచ‌ల‌నాల‌తో ముందుకు వెళుతున్నారు. ఏకంగా ఐదుగురు ఎస్సీల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే అరుదైన సంద‌ర్భ‌మైంది. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఇవ్వ‌డం కూడా రికార్డు. ఇక తాజాగా క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో జ‌గ‌న్ కొద్ది రోజుల క్రిత‌మే లాక్‌డౌన్‌ను క్ర‌మ‌క్ర‌మంగా ఎత్తివేయాల‌ని... దీనివల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ముప్పురాకుండా చూసుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి సూచించిన‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మైంది.

 

అయితే ఇప్పుడు ప‌రిస్థితులు ఇప్ప‌ట్లో పూర్తిగా మారే ఛాన్సులు లేక‌పోవ‌డంతో ప్రధానితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పుడు దీన్ని సమర్ధిస్తున్నారు. తొలుత జగన్ అభిప్రాయాన్ని విమర్శించిన విపక్ష పార్టీలు సైతం తాజాగా దీనిపై మాట్లాడటమే మానేశాయి. క‌రోనా ఇప్ప‌టికిప్పుడు పూర్తిగా త‌గ్గిపోద‌ని.. ఎవ‌రి రేపు మాపు ఎవ‌రికి అయినా రావొచ్చ‌ని... దీనితో పాటు క‌లిసే మ‌నం అంద‌రం ముందుకు వెళ్లాల‌ని జ‌గ‌న్ సూచించిన‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీవ్రంగా విమ‌ర్శించారు. అయితే ఇప్పుడు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా వ్యాప్తి ఆగ‌డం లేదు.

 

ఇలాగే లాక్‌డౌన్ కంటిన్యూ అయితే ఈ ప్ర‌భావం వ‌ల్ల దేశంలో ఆక‌లి చావులు పెరిగే ప్ర‌మాదం ఉంది. అందుకే జ‌గ‌న్ క‌రోనా విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే క్ర‌మ‌క్ర‌మంగా లాక్‌డౌన్ ఉప‌సింహ‌రించుకుంటూ ఉండాల‌ని త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇక ఇప్ప‌టికే రెండుసార్లు లాక్‌డౌన్ పోడి
గించినా కేసులు త‌గ్గ‌లేదు... స‌రిక‌దా పెరుగుతున్నాయి. దీంతో కంప్లీట్ లాక్‌డౌన్ కంటే జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ క‌రోనాను క‌ట్ట‌డి చేసుకుంటూ మ‌నం ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. 

 

ఇక మోదీ కూడా లాక్ డౌన్ ఎంత ముఖ్యమో ఆర్ధిక వ్యవస్ధను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆ తర్వాత ప్రధాని విస్పష్టంగా ప్రకటించారు. ఇక జ‌గ‌న్ తీరును ముందుగా త‌ప్పుప‌ట్టిన ఏపీ విప‌క్ష పార్టీలు సైతం జ‌గ‌న్‌కే ఓటేస్తున్నాయి. ఏదేమైనా జ‌గ‌న్ విషయంలో న‌వ్విన నాప‌చేసే పండింద‌న్న‌ది మ‌రోసారి నిజ‌మైంది. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: