దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 46,000 దాటింది. ఇప్పటివరకు 1566 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. దేశవ్యాప్తంగా మే నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ వల్ల ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదాయం లేక సామాన్యులు, దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. 
 
దీంతో కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని కేంద్రం గతంలో ప్రకటన చేసింది. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు విడుదల చేసిన సమయంలో కరెంట్ బిల్లును లాక్ డౌన్ తర్వాత చెల్లించినా పరవాలేదని పేర్కొంది. అయితే కేంద్రం చేసిన ఈ ప్రకటన వల్ల పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఢిల్లీ విద్యుత్ శాఖ వినియోగదారుల కొరకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 
 
సకాలంలో కరెంట్ బిల్లు చెల్లించేవారికి ఎయిర్ కూలర్, టీవీ, స్మార్ట్ ఫోన్ లాంటి బహుమతులు ఇవ్వాలని వినూత్నంగా ఆలోచించింది. గతంలో విద్యుత్ శాఖ సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వచ్చి మీటర్ రీడింగ్ తీసి కరెంట్ బిల్లులు ఇచ్చేవారు. ప్రస్తుతం కేంద్రం కరెంట్ బిల్లులపై మూడు నెలల మారటోరియం విధించటంతో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. 
 
ఢిల్లీ విద్యుత్ శాఖ ఎవరి ఇంటి మీటర్ వారు చూసుకుని బిల్లు చెల్లిస్తే లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఈ స్కీమ్ ఢిల్లీలో అమలవుతోంది. ఇక్కడ సక్సెస్ అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో గత నెల రీడింగ్ తీయకపోవడం వల్ల విద్యుత్ బిల్లులు వినియోగదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గ్రూప్ టారిఫ్ నిర్ణయించి విద్యుత్ శాఖ బిల్లులు వసూలు చేస్తుండటం వల్ల కేటగిరి మారిపోయి ఎక్కువ బిల్లులు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: