ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్ల వ్యవస్థకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఉత్తర్వుల్లో అన్ని జిల్లాల నాన్‌కేడర్ జేసీలను ఆసరా, వెల్ఫేర్‌ జేసీలుగా నియమిస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
అధికారులు బదిలీ అయిన స్థానాలు : 
 
శ్రీకాకుళం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - సుమిత్ కుమార్ 
 
శ్రీకాకుళం జేసీ ( అభివృద్ధి) - కె శ్రీనివాసులు 
 
విజయనగరం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - జి. క్రిస్ట్ కిషోర్‌కుమార్ 
 
విజయనగరం జేసీ ( అభివృద్ధి) - మహేష్‌ కుమార్ రావిరాల 
 
విశాఖ పట్నం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - ఎం.వేణుగోపాల్‌రెడ్డి 
 
విశాఖ పట్నం జేసీ ( అభివృద్ధి) - పి. అరుణ్‌బాబు 
 
తూర్పు గోదావరి జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - జి.లక్ష్మీషా 
 
తూర్పు గోదావరి జేసీ (అభివృద్ధి) - కీర్తి చేకూరి 
 
పశ్చిమ గోదావరి జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - వెంకటరమణ 

 

పశ్చిమ గోదావరి జేసీ (అభివృద్ధి) - హిమాన్షు శుక్లా 
 
కృష్ణా జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - కె.మాధవీలత 
 
కృష్ణా జేసీ (అభివృద్ధి) - శివశంకర్‌ లోతేటి 
 
గుంటూరు జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - ఏఎస్‌ దినేష్‌కుమార్ 
 
గుంటూరు  జేసీ (అభివృద్ధి) - పి.ప్రశాంతి 
 
ప్రకాశం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - జె.వెంకటమురళీ 
 
ప్రకాశం జేసీ  (అభివృద్ధి) - టీఎస్ చేతన్ 
 
నెల్లూరు జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - వి.వినోద్‌కుమార్ 
 
నెల్లూరు జేసీ (అభివృద్ధి) - ఎన్. ప్రభాకర్‌రెడ్డి 
 
చిత్తూరు జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - డి. మార్కండేయులు 
 
చిత్తూరు జేసీ (అభివృద్ధి) - వీరబ్రహ్మయ్య 
 
కడప జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - ఎం.గౌతమి 
 
కడప జేసీ (అభివృద్ధి) - సాయికాంత్ వర్మ 
 
కర్నూల్ జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - రవిసుభాష్ 
 
కర్నూల్ జేసీ (అభివృద్ధి) - ఎస్.రామసుందర్‌రెడ్డి 
 
అనంతపురం జేసీ (రైతు భరోసా, రెవిన్యూ) - నిషాంత్‌కుమార్ 
 
అనంతపురం జేసీ (అభివృద్ధి) - లావణ్య వేణి 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: