పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి వ్యాఖ్యలు చేస్తూ సంచరిస్తూ ఉంటారు. ఇక తాజాగా మరోసారి షాహిద్ అఫ్రిది తన వక్ర  బుద్ధుని బయటపెట్టాడు. కాశ్మీర్ మొత్తం తమదే అన్నట్లుగా అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తూ మరోసారి అగ్గి రాజేస్తున్నట్లుగా  మాట్లాడాడు షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కాశ్మీర్ కశ్మీర్ జట్టు కెప్టెన్గా తానే ఉంటాను అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కి విజ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా కాశ్మీర్ పేరిట ఒక కొత్త టీమ్ ప్రాంచైజీ  కూడా ఉండాలి అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ను విజ్ఞప్తి చేశాడు షాహిద్ అఫ్రిది. 

 

 

 వచ్చే పాకిస్తాన్ సూపర్ లీగ్ నాటికి కాశ్మీర్ టీం ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జట్టుకు తానే కెప్టెన్ గా ఉంటాను అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు విన్నవించాడు షాహిద్ అఫ్రిది. అంటే ప్రస్తుతం షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలను బట్టి కాశ్మీర్ తమదే అన్నట్లుగా ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేసారు అని అంటున్నారు భారతీయులు. అయితే కాశ్మీర్ లో ఏకంగా ఒక స్టేడియం అకాడమీ ఏర్పాటు చేయడానికి తాను  ఆర్థిక సాయం చేస్తానని కూడా వ్యాఖ్యలు చేశారు. 

 

 

 అయితే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయమైన 370 ఆర్టికల్ రద్దు పై కూడా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. షాహిద్ వ్యాఖ్యలపై ఏకంగా భారత ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే  తాజాగా కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా పీవోకేలో పర్యటిస్తూ పేద ప్రజలకు తన ట్రస్ట్  ద్వారా సహాయం చేసేందుకు వచ్చి  నరేంద్ర మోడీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైన్యం సంఖ్య ఏడు లక్షల మాత్రమే కానీ భారత ప్రభుత్వం మాత్రం ఏకంగా ఏడు లక్షల సైన్యం కాశ్మీర్ కాశ్మీర్ లో ఉంచిందని... అయినప్పటికీ అక్కడి పౌరులు  పాకిస్తాన్ కి మద్దతు ప్రకటిస్తున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మనసు కరోనా కంటే ప్రమాదకరమైనది అంటూ మరోసారి తన వక్రబుద్ధిని  బయటపెడతూ విషం  వెళ్లగక్కాడు షాహిద్ అఫ్రిది.

మరింత సమాచారం తెలుసుకోండి: