తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క కరోనా వైరస్ వల్ల వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మండుటెండల్లో గుట్టలు సైతం లెక్కచేయకుండా దట్టమైన అడవులలో ఉన్న ప్రజల కోసం నిత్యావసరాల సరుకులు చేరవేస్తూ బాధ్యత గల రాజకీయ నేతగా సీతక్క రాణిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయం ఇదే అని పిలుపు ఇవ్వటం జరిగింది. అయితే కేసీఆర్ పిలుపు విషయంలో టిఆర్ఎస్ పార్టీ నేతల సంగతేమోగాని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాత్రం ఇటువంటి భయంకరమైన సమయంలో నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అవసరాలను తీరుస్తూ తన నియోజకవర్గ ప్రజలను ఒక తల్లి లాగా ఆదరించింది అని చెప్పవచ్చు.

 

వాగులు, వంకలు దాటుకుంటూ అడవిలో ఉన్న గిరిజన పుత్రులకు ఆకలి తీర్చిన నేతగా సీతక్క తన సేవలు అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వారాంతపు సంతలు బంద్ అయిపోయాయి. మారుమూల గ్రామాల్లో ఉండే గిరిజనుల బతుకులు ఏరోజుకారోజు బతికే బతుకులు కావటంతో వారికి నిత్యవసర సరుకులు కూరగాయలు కొనడం కష్టమైపోయింది. దీంతో ఆకలితో అలమటించి పోయిన తండాలకు మరియు గిరిజనులకు తానే ఒక తల్లి లాగా దారి లేక పోయినా గాని నెత్తి మీద మూటలు మోసుకుంటూ వారి ఆకలి బాధలను తీరుస్తోంది సీతక్క.

 

ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు చేయని విధంగా సీతక్క ఈ కరోనా మహమ్మారి వేల ప్రజలకు అందుబాటులో ఉంటూ తనని ఎన్నుకొన్న ప్రజలను ఆదరిస్తూ, అండగా నిలబడుతూ అసలుసిసలైన పొలిటికల్ లీడర్ అనిపించింది. కాగా ఇదే సీతక్క బీజేపీ ఎమ్మెల్యే అయి ఉంటే కచ్చితంగా జాతీయ మీడియా ఫోకస్ చేసేది అని పలువురు సీనియర్ రాజకీయ నాయకుల వాదన. సీతక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావటంతో ఆమె ఎంత చేస్తున్నా గాని పెద్దగా ఫోకస్ అవటం లేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: