నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేది ఒక జర్నలిజం మాత్రమే అన్న విషయం అందరికి తెలిసిందే.. నిజానికి జర్నలిజం కేవలం ఉద్యోగమే కాదు అది ఒక బాధ్యత.. నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్మున్న జర్నలిస్ట్ ఎవరైనా, భయపెడితే తన కలంలోని బలాన్నికున్న ధైర్యమంటే ఏమిటో చూపిస్తాడు.. కానీ నేటికాలంలో పరిస్దితులు పూర్తిగా మారాయి.. ప్రస్తుత కాలంలో మీడియా అంటే కేవలం వ్యాపారం మాత్రమే. నిజాన్ని నిర్భయంగా చెప్పే అవకాశం ఉన్నా కూడా ధైర్యం చాలక కొందరు.. ప్రలోభాలకు లొంగి కొందరు.. ఇలా రకరకాల కారణాలతో సుఖంగా బ్రతికితే చాలు ఎందుకొచ్చిన గొడవ అని బ్రతకడానికి అలవాటు పడ్డారు.. ఇలా సత్యం అనేది శ్మశానంలో శవంగా మారింది..

 

 

ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా క్లారీటిగా చెప్పలేక పోవడం వల్ల వార్తలు చదివే పాఠకులు అయోమయంలో పడిపోతున్నారు.. ఇకపోతే తాజాగా ‘క్యూ న్యూస్‌’ యూట్యూబ్‌ ఛానెల్‌పై చర్యలు తీసుకోవాలంటూ తెరాస విద్యార్థి విభాగం నేతలు ఆదివారం సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. దీనికి కారణం ఈ యూట్యూబ్‌ ఛానెల్ వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసత్య ప్రచారం చేస్తున్నరట.. అంతే కాదు ఈ ఛానెల్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తున్న తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ సీహెచ్‌ నవీన్‌ కుమార్‌, ఈ చానల్లో ప్రసారమయ్యే పలు వీడియోల్లో కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై  అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

 

గౌరవనీయులైన ముఖ్యమంత్రి పై రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారంటూ బురద చల్లుతున్న సదరు రిపోర్టర్‌తో పాటు ఛానల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని, తెరాస విద్యార్థి విభాగం నేతలు అందులో పేర్కొన్నారు.. ఇకపోతే ఇప్పుడు వస్తున్న కొన్ని కొన్ని వార్తల్లో ఉన్న నిజనిజాలు ఎంతవరకు వాస్తవాలో తెలియదు గానీ, ఒకప్పుడు మీడియా అంటే ఉన్న గౌరవం, మర్యాద ప్రస్తుత కాలంలో ప్రజల్లో లేవనే అంటున్నారు.. ఎందుకంటే అవినీతిని బయటపెట్టే జర్నలిజం కూడా ఆ మరకలను అంటించుకుని మసిబారిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: