కరోనా రాకుండా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు సాధారణ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది.వీటిలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు ఉన్నాయి.శ్వాస ఇబ్బందులు ఎదుర్కుంటున్న రోగులకు దగ్గరగా ఉండకూడదని సూచించారు.తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది.పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.

 

అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.చైనా ప్రభుత్వం గతంలో సార్స్ వ్యాపించినపుడు తీసుకున్న చర్యలనే కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు కూడా పాటిస్తోంది.అంటే, దేశంలో ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్టు ధ్రువీకరిస్తే, వారిని మిగతా అందరికీ దూరంగా ఉంచుతారు.కరోనాఇన్ఫెక్షన్ వచ్చిన రోగులను 'లైట్, మీడియం, సీరియస్ అనే మూడు కేటగిరీలుగా విభజించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యులకు సూచించింది.రోగులకు చికిత్స అందించే ఆరోగ్య సిబ్బంది ఈ వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

 

తులను వీలైనన్ని సార్లు సబ్బుతో లేదా శానిటైజర్ లిక్విడ్ తో కడుక్కోవాలిమొహాన్ని, నోటిని మరియు ముక్కుని చేతులతో తాకడం వీలైనంతగా తగ్గించాలి.
జ్వరం, దగ్గు మరియు జలుబుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండడం మంచిదిషేక్ హ్యాండ్ ఇవ్వడం మరియు స్పర్శతో కూడిన ఎటువంటి పలకరింపులైన తగ్గించడం మంచిది.జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సంచరించకుండా జాగ్రత్తలు వహించడం మంచిది.ఈ వైరస్ సోకిన వారికి ముందుగా జలుబు వస్తుంది. ఆపై జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆపై చికిత్స అందకపోతే తీవ్రమైన న్యుమోనియాకు దారితీయడం, కిడ్నీ వంటి కీలక అవయవాలు విఫలమై ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది.చలికాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.ఇది సోకిన వాళ్లు తుమ్మినా, దగ్గినా వారి ద్వారా ఈ వైరస్ ఇతరుల శ్వాసకోశ నాళంలోకి ప్రవేశించడం ద్వారా వ్యాప్తి చెందుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: