ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడాలి అంటే... రాజకీయంగా కొన్ని కొన్ని నిర్ణయాలు కాస్త వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీలో కొంత మందిని బయటకు పంపించే ఆలోచన కూడా పరోక్షంగా చేయాల్సి ఉంటుంది. పార్టీలో పదవుల విషయంలో అధినేత చంద్రబాబు నాయుడు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కొందరు నేతలు పదే పదే పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు. రాజకీయంగా  బలహీనంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు కి  సంకలో పుండు మాదిరి మారారు వాళ్ళు. 

 

వాళ్ళను ఎన్ని విధాలుగా బుజ్జగించాలి అని చూసినా సరే వాళ్ళు మాత్రం  పార్టీలో ఉండే ఆలోచన అసలు ఏ విధంగా కూడా చేయడం లేదు. అయితే తాజాగా గంటా శ్రీనివాసరావు విషయంలో మాత్రం చంద్రబాబు ఏ ప్రయత్నాలు చేయలేదు అని పార్టీ నేతలే అంటున్నారు. గంటా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అని కొంత కాలం క్రితమే చంద్రబాబు తెలుసుకున్నారు. గతంలో కూడా గంటా ఇలాగే  పార్టీ నుంచి ఒకసారి బయటకు వెళ్ళారు. ఇప్పుడు మరోసారి అదే విధంగా ఆయన బయటకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. ఇక ఆయనను బుజ్జగించావద్దు అనే భావన లో చంద్రబాబు ఉన్నారట. 

 

జిల్లా నేతలు ఎవరూ కూడా ఆయనను పార్టీలో ఉండాలి అని కోరవద్దు అని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారట. గంటా పార్టీ మారడానికి ఎప్పటి నుంచో చూస్తున్నారు అని, ఆ సమయం ఇప్పుడు వచ్చింది అని, ఆయనను ఎంత మాత్రం బ్రతిమిలాడి ఉంచాల్సిన అవసరం లేదని చెప్పేసారట. ఆయనకు ఇవ్వాల్సిన  ప్రాధాన్యత ఇచ్చామని, ఆయన ఉండటం ఉండకపోవడం అనేది ఆయన ఇష్టం అని గంటాను ఉద్దేశించి జిల్లా పార్టీ నేతలతో అన్నారట. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంత సీన్ లేదని, చేస్తే అప్పుడు చూద్దాం అని అన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: