అదీ సంగతి ప్రోమో చూశారా.. అసలు ఆంధ్రజ్యోతికీ, జగన్ కూ పడదు కదా.. అవి రెండు ఉప్పు, నిప్పు కదా అనుకుంటున్నారా.. అవును నిజమే. మరి అలాంటప్పడు ఆ ప్రోగ్రామ్‌పై జగన్ మాట్లాడటమేంటి అన్న సందేహం కూడా రావచ్చు.. కానీ..ఇది నిజంగా మాట్లాడిన వీడియో కాదు లెండి.. ఎక్కడో ఏదో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మాట్లాడిన మాటలను ఇక్కడ కట్ అండ్ పేస్ట్ చేశారు. తెలంగాణ సీఎం విషయంలోనూ అంతే.
మరి సీఎం జగన్ వీడియోను అలా వాడుకుంటే ఊరుకుంటారా.. అందులోనూ అది ఆయనకు నచ్చని మీడియా కదా అంటారా.. అది నిజమే కానీ.. ఈ ప్రోగ్రామ్‌కు ఇబ్బంది లేదు. ఎందుకంటే.. ఇది న్యూస్ బేస్డ్ కామెడీ ప్రోగ్రామ్. వీ6లో తీన్మార్.. సాక్షిలో గరం గరం వార్తలు, టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ టైపు అన్నమాట. అన్నట్టు ఈ ప్రోగ్రామ్ యాంకర్ రాములమ్మ కూడా గతంలో వీ6 తీన్మార్‌లో ప్రారంభంలో చేసిన యాంకరే. ఆమెకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కొట్టిన పిండే.
అయితే మరి ఈ ప్రోగ్రామ్ వచ్చేది ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో.. మరి ప్రోగ్రామ్‌లో ఏదైనా జగన్ కు సంబంధించి కామెడీ శ్రుతి మించితే మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ తరహా కామెడీ న్యూస్ నిర్వహిస్తున్న ఛానళ్లు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కానీ ఇది ఏబీఎన్ కదా. ఏదైనా తేడా వస్తే మాత్రం వివాదం అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలకు రేటింగ్స్ బావుండటంతో ఇప్పుడు ఏబీఎన్ కూడా కిరాక్ న్యూస్ అంటూ కామెడీ బాట పట్టిందన్నమాట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి