ఇదిలా ఉంటే ఈ విద్యా కానుక పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెల్సిందే. ఇది జగనన్న విద్యా కానుక అనే కంటే, దాన్ని మోదీ, జగన్ అన్న విద్యా కానుక అని పెట్టి ఉంటే బాగుండేదేమో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం బాగా వైరల్ అయింది. ఈ పథకం కోసం కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 శాతం మాత్రమే ఇస్తోందని చెప్పుకొచ్చారు. ఇక పవన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే, జనసైనికులు దాన్ని బాగా వైరల్ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని మరింతగా అల్లరి చేశారు. ఈ రకంగా జనసేన కు మంచి క్రెడిట్ వచ్చినా, పవన్ ఈ రకంగా వ్యవహరించడంపై ఇప్పుడు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
అసలు పవన్ కంటే ముందుగానే సోము వీర్రాజు ఈ వ్యవహారం పై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. కానీ ఆయన అలా చేయకుండా, నేరుగా ఈ వ్యవహారంపై జనసేన స్పందించడం తో ఇప్పుడు బీజేపీ తీవ్ర ఇబ్బంది పడుతోంది. అయితే ప్రస్తుతం బిజెపి వైసిపి ల మధ్య పొత్తు ఏర్పడే అవకాశం ఉండడంతో, ఏపీ బీజేపీ నేతలే ఈ విధంగా విమర్శలు చేయించారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఏమో బీజేపీ రాజకీయం ఈ విధంగా కూడా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి