వైసీపీకి పక్కలో బల్లెంలా తయారైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సొంతపార్టీ పైన సీఎం జగన్ పైన సంచలనమైన కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇలాగే ఉన్నట్లయితే రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు ఎదురై మరోసారి కోర్టులు చుట్టుతిరగాల్సివస్తుందని అన్నారు. నేను ఎంపీగా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి మంచి సలహాలు ఇస్తే.. నేనంటే పడని మరి కొందరు నాయకులు నా పైన లేనిపోని ఆరోపణలు సృష్టించి చివరకు నా పైన, నా ఆస్తుల పైన సిబిఐ ఎంక్వైరీ చేయించే విధంగా కేంద్రాన్ని కోరారు.


అంతేకాకుండా నా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ స్పీకర్ కు కూడా లేఖ రాశారు. ఇది లోక్సభ స్పీకర్ పట్టించుకోకపోవడంతో చివరకు వైయస్సార్ సిపి పార్టీ తరఫున నా పై అనర్హత వేటు వేస్తామని తమ మీడియా లో పిచ్చి రాతలు రాస్తున్నారు. అయితే నేను దేనికీ భయపడని గత లోక్సభ ఎన్నికల్లో నా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు జగన్ ను చూసి ఓటు వేయలేదని కేవలం నాయకత్వాన్ని నా వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేశారని వైయస్సార్ సిపి పార్టీ ముఖ్యమంత్రి గాని నాయకులు గాని నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నన్ను ఏమి చేయలేరు . అయితే ఎవరిని ఎవరు తొలగిస్తా రో మరి కొద్ది రోజులు ఆగితే అసలు విషయం బయట పడుతుందని నేను ఈ విషయాన్ని అతిశయోక్తితో చెప్పుతున్నది కాదని అన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ కి సవాల్ విసురుతూ.. దమ్ముంటే అమరావతి రాజధాని అంటూ  రెఫరెండం గా ఎన్నికలకు వెళితే జగన్ పై నేను అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తారని అని సవాల్ విసిరారు.


ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాం నిన్నే రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్న అప్పుడు. . ఎలాంటి కేసులు లేని నా పై తప్పుడు కేసులు పెట్టి.. నన్ను వేధిస్తున్నప్పుడు.. ప్రజలు నన్ను కూడా ఎంతో విశ్వసిస్తారని మీరు తెలుసుకోవాలి. అంటూ ముఖ్యముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇలాగే ఉన్నట్లయితే రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు ఎదురై మరోసారి కోర్టులు చుట్టుతిరగాల్సివస్తుందని అన్నారు.మంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: