150 స్థానాలకు 104 సీట్లు గెలుస్తామనే ధీమాలో టీఆర్ఎస్, ఈ సారి గోల్కోండ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లను సాధిస్తామంటోంది. టీడీపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. మరోసారి గ్రేటర్ పీఠం దక్కించుకునేందుకు మంత్రి కేటీఆర్ అన్నీ తానై ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియానికి మాత్రమే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను డివిజన్ ఇన్‌చార్జిలుగా టీఆర్ఎస్ నియమించింది. కాలనీలు, బస్తీల వారీగా పార్టీ నాయకులు ప్రచారం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎన్నికల కార్యాలయంలో అడిక్‌మెట్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బి.హేమలత జయరాంరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడిక్‌మెట్ డివిజన్ సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం స్థానిక ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలన్నారు. గత ఐదేళ్లలో డివిజన్‌లో అనేక బస్తీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ చేశామన్నారు. బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామన్నారు. మరోసారి తనను గెలిపిస్తే పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

అభివృద్ధిని కోరుకునే వారు టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలన్నారు. బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తోందన్నారు. ఓట్ల కోసం బీజేపీ కుట్రకు పాల్పడుతోందని బి.హేమలత జయరాంరెడ్డి ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని, టీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు శ్యాంసుందర్, కె.మాధవ్, సుధాకర్ గుప్త,  మల్లికార్జున్ రెడ్డి, రూపేందర్, జహంగీర్, బొట్టు శ్రీనివాస్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రసన్న,  రవి యాదవ్, నేత శ్రీనివాస్, ప్రేమలత రెడ్డి, మాధవి, రింకు టింకు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: