వైసీపీ కీల‌క నేత‌, జ‌బ‌ర్ద‌స్త్ రోజా వ్య‌వ‌హారం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ప్రివిలేజ్ క‌మిటీ భేటీకి రోజా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న‌కు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే జ‌రుగుతున్న అవ‌మ‌నాలను వివ‌రించారు. అభివృద్ధి విష‌యంలో త‌న‌కు ఎదుర‌వుతున్న ప‌రాభ‌వాల‌ను కూడా వివ‌రించిన‌ట్టు తెలిసింది. అయితే.. దీనిపై కాకాని సానుకూలంగానే స్పందించారు. ప‌రిస్థితిని అధికారుల‌కు వివ‌రిస్తామ‌న్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రోజా ప‌రిస్థితి ఇప్పుడు చాలా బ్యాడ్‌గా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. రోజా ప‌రిస్థితి ఇప్పుడే కాదు.. దాదాపు ఏడు నుంచి ఎనిమిది మాసాలుగా ఆమె ప‌రిస్థితి దారుణంగా ఉన్న విష‌యం ఇక్క‌డ ఎవ‌రిని అడిగినా చెబుతారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. త‌న‌ను తాను ఎక్కువ‌గా ఊహించుకోవ‌డ‌మేన‌ని, ఎవ‌రినీ లెక్క‌చే య‌క‌పోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క మంత్రులు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ ఇద్ద‌రితోనూ రోజాకు విభేదాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే న‌గ‌రిలో రోజాకు ధీటుగా మ‌హిళా నేత ‌ను ఒక మంత్రి ప్రోత్స‌హిస్తున్నారు. దీంతో ఆమె క‌నుస‌న్న‌ల్లోనే అన్నీ జ‌రుగుతున్నాయి. దీంతో రోజా త‌ట్టుకోలేక పోతున్నారు.

పైగాతాను ఏరికోరి ఎంచుకుని మ‌రీ తెచ్చుకున్న అధికారులు కూడా రోజా మాట వినిపించుకోవ‌డం లేదు. ప‌లితంగా .. రోజా ప‌రిస్థితి రెండు అడుగులు ముందుకు , నాలుగు అడుగులు వెన‌క్కి అన్నచందంగా మారిపోయింది. త్వ‌ర‌లోనే స్థానిక ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రింత‌గా రోజాకు చెక్ ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో త‌న‌ను గ‌త ఎన్నిక‌ల్లో గెలిపించిన వారికి, త‌ను ఉన్నా.. లేకున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో మేనేజ్ చేస్తున్న వారికి రోజా ఇప్పుడు న్యాయం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే.. ఈ ప‌రిణామానికే మంత్రుల్లో ఒక‌రు చెక్ పెడుతున్నారు.

 ఫ‌లితంగా ఒక్క ప‌నికూడా ముందుకు సాగ‌డం లేదు. అస‌లు రోజాకే విలువ లేకుండా పోయింద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌పైనే.. రోజా ఇప్పుడు ప్ర‌విలేజ్‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇది ప్రివిలేజ్ ప‌రిధి కాద‌ని ముందుగానే తేలిపోవ‌డం.. మంత్రి బ‌లంగా ఉండ‌డంతో మున్ముందు.. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోగా.. మ‌రింత ముడిప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: