కేంద్రం లో బీజేపీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు కేవలం దేశం లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆదర్శం గా మారి పోతున్నాయి అనే విషయం తెలిసిందే . పాత పద్ధతులు కాకుండా సరికొత్త టెక్నాలజీకి అనుగుణం గా వినూత్న ఆలోచనల తో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే విధంగా ఎంతో అద్భుతమైన ఆవిష్కరణల తో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందుకు సాగుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శం గా నిలుస్తోంది. అద్భుతమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఇక ఆ లక్ష్యాన్ని సాధించాలనే తపనతో దృఢ సంకల్పం తో ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం.



 ఈ క్రమంలోనే చూస్తుండగానే భారత్ లో ఎన్నో రకాల అభివృద్ధి ముందుకు సాగుతూనే ఉంది. ఒకప్పుడు దేశంలో ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం ఇలా కరెంటు ఎందుకు పోతుంది అని అనుకునే పరిస్థితిలో ఉన్నారు  ప్రతి ఒక్కరు. అంతేకాదు కరెంటు ధరలు కూడా ప్రస్తుతం భారీగా తగ్గిపోయాయి. ముఖ్యంగా సోలార్ పవర్ పైన ప్రస్తుతం భారత ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం సోలార్ పవర్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.



 ముఖ్యంగా 2014 నుంచి 2020 మధ్యకాలంలో 30 వేల మెగావాట్ల సోలార్ పవర్ దేశంలో ఎక్కువగా ఉత్పత్తి కావడం గమనార్హం. కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోనే 27వేల 500 మెగావాట్ల సామర్థ్యం పెరిగింది. ప్రస్తుతం సూర్యరశ్మి ద్వారా సోలార్ సిస్టంతో భారీగా  పవర్ ని ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రపంచ దేశాలకి కూడా ప్రస్తుతం భారత్ సరఫరా చేస్తోంది. ఇలా భారత్లో కళ్ళ ముందే ఎన్నో మార్పులు జరుగుతున్నప్పటికీ ఎవరూ గమనించలేని విధంగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. భారత్ సూర్యుని బాగా వాడే స్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: