ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల వేడి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎన్నికలకు ససేమిరా అన్న జగన్ సర్కార్ ఇప్పుడు కోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు జరగడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ ఎన్నికలు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. అంతేకాదు నిమ్మగడ్డ పై తీవ్ర ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరో వైసీపీ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై విమర్శలు గుప్పించారు.



ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. 'గ్రామాల్లో శాంతియుత, వాతావరణం నెలకొనాలి, ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడ ఉందో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చెప్పాలి. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానా ప్రకటించడం అన్నది దశాబ్దాలుగా ఉంది. ఆ పద్ధతిని ఇప్పుడు తప్పు అంటున్నారు.. అప్పుడు టీడీపీ కూడా అదే చేసింది. అప్పుడు ఇలాంటివి కనిపించలేదా అంటూ ద్వజమెత్తారు.అప్పుడు ఎన్నికలు ఎందుకు జరపలేదు? అప్పటికే ఉన్న జీవో మీద కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏకగ్రీవాలు ఎక్కవ అయితే వాటిని వ్యతిరేకిస్తానన్నట్టుగా నిమ్మగడ్డ చెప్పడమే రాజకీయం కాదా అంటూ పెద్ది రెడ్డి ప్రశ్నించారు. 



పంచాయతీల్లో ఏకగ్రీవాలపై అటు చంద్రబాబు, ఇటు నిమ్మగడ్డ ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వెనుక కారణాలు ఏమిటో అంతు చిక్కడం లేదని ఆరోపించారు.నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో... ఏ చట్టంలో ఇది రాసి ఉందో ఆయన వెల్లడించగలరా? ఏ చట్టంలో లేని వ్యవహారాన్ని ఆయన ఒక ఉద్దేశంతో చెప్తున్నారు.. ఇప్పుడు నిమ్మగడ్డ    ప్రవర్తిస్తున్న తీరును చూస్తే చంద్రబాబు కు తొత్తులా మారాడని తెలుస్తుంది.అంటూ ఆయన అన్నారు.వ్యవస్థలను సవ్యంగా, నిష్పక్షపాతంగా నడిపించాల్సిన వ్యక్తి ఇన్ని దురాగాతాలకు పాల్పడుతుంటే.. ఇక ఎన్నికల కమిషనర్‌ మీద ప్రజలకు నమ్మకం ఏముంటుంది? అంటూ మంత్రి మండిపడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి: