ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ దూకుడు పెరిగింది. మాజీ ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్‌.. ఇంట్లోనే ఉంటున్నా.. ఆయ‌న అనుచ‌రులు.. వ్యూహ‌క‌ర్త‌లు.. మాత్రం క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసుకుని పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌లో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి కూడా ఓడిపోయిన చింతమనేనికి చంద్ర‌బాబు పెద్ద‌గా గౌర‌వం ఇవ్వ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో పార్టీలో ప‌ద‌వులు కూడా ద‌క్క‌క‌పోవ‌డాన్ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో చింత‌మ‌నేని ఇప్పుడు వ‌చ్చిన పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను టీడీపీకి సానుకూలంగా మార్చి.. త‌న స‌త్తానిరూపించుకునేందుకు రెడీ అయ్యారు.

గ్రామ‌స్థాయిలో చూసుకుంటే.. దెందులూరు ప‌రిధిలో.. చింత‌మ‌నేని ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో మాత్రమే అభివృద్ధి కార్య‌క్ర‌మాలు సాగాయి తప్పా.. ఇప్పుడు వైసీపీ హ‌యాంలో ఏ ఒక్క కార్య‌క్ర‌మం కూడా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ప‌క్క‌నే ఉన్న చింత‌ల‌పూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కం నుంచికూడా నియోజ‌క‌వ‌ర్గంలోని రైతుల‌కు ప్ర‌స్తుత ఎమ్మెల్యే నీళ్లు తెచ్చుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో గ‌తంలో చింత‌మ‌నేని చేసిన సాయ‌మే ఇప్ప‌టికీ రైతుల‌కు అక్క‌ర‌కొస్తోంది. ఈ నేప‌థ్యంలో చింత‌మ‌నేని హ‌వా.. కొన‌సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అటు ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రికి రైతుల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగింది. మ‌రోవైపు గ్రామ పంచాయ‌తీలు.. గ‌త 2013 ఎన్నిక‌ల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్క‌డ వైసీపీ దూకుడు పెద్ద‌గా లేదు. పైగా ఎమ్మెల్యేకు గ్రామీణ వాతావ‌ర‌ణంలోని ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య పెద్ద‌గా క‌నెక్టివిటీ కూడా లేద‌ని తెలుస్తోంది. ఇక‌, చింత‌మ‌నేని వ్య‌వ‌హారం చూస్తే.. ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట‌యి ఉండ‌డంతోపాటు.. ఆయ‌న ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్ట‌డం కూడా క‌లిసి వ‌స్తోంది.

అలాగే అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ఓ ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారు. దీంతో కొన్ని వివాదాల్లోకి కూడా వెళ్లారు. ఇదే వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారి 2019 ఎన్నికల్లో చింతమనేని ఓటమికి కారణమైంది. కానీ తర్వాత చింతమనేని సైలెంట్ అయ్యారు. అటు వైసీపీ ఎమ్మెల్యే పెద్దగా వర్క్ కూడా చేయడం లేదు. ఈ క్రమంలోనే చింతమనేని దూకుడుగా ఉన్నా సరే పనిచేసేవారు అని, కానీ ఇప్పుడు ఏది లేకుండా పోయిందని దెందులూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే దెందులూరు ప‌రిధిలో చింత‌మ‌నేని హ‌వా మ‌ళ్లీ మొద‌లైంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా చింతమనేనితో వైసీపీకి ఇబ్బందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: