కరోనా మహమ్మారి ఇక వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకోగానే మళ్లీ వచ్చి టెన్షన్ పెడుతోంది . ఇప్పుడిప్పుడే కరోనా వెళ్లిపోయిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. డిసెంబర్ లో అన్ని బిజినెస్ కు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయి . వలస కార్మికులు మళ్ళీ పట్నం బాట పడుతున్నారు . ఇలాంటి సందర్భంలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ మొదలయింది. ముఖ్యంగా మనదేశంలో కేరళ, మహారాష్ట్ర లో కరోనా సెకండ్ వేవ్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలము సరిహద్దు రాష్ట్రాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు . ఇప్పటికే కేరళకు బార్డర్ లో ఉన్న రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి . ఇక మహారాష్ట్ర కు ఆనుకుని ఉన్న తెలంగాణ సైతం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నుండి వస్తున్న ప్రయనికులని థర్మల్ స్క్రీనింగ్ చేసేందుకు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది . తెలంగాణ లోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు మహారాష్ట్ర కు సరిహద్దులుగా ఉన్నాయి .

ఈ రెండు జిల్లాల గుండా మహారాష్ట్ర లోని ప్రజలు రాకపోకలు జరుపుతుంటారు . దాంతో తెలంగాణ విద్యారోగ్య శాఖ ఈ రెండు జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది . జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు స్క్రీనింగ్ చేయాలని పేర్కొంది . అయితే మహారాష్ట్ర నుండి బైక్ పై, ఇతర వాహనాల్లో వస్తున్న ప్రయనికులకు చెక్ పోస్ట్ ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నవాళ్లు, జలుబు దగ్గు ఉన్నవాళ్ళని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ బస్సులు రైళ్లలో వస్తున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడం లేదు. దాంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైళ్లలో నిజామాబాద్ కు ఎక్కువ మంది ప్రయాణికులు వస్తుంటారు. దాంతో స్టేషన్ లో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: