పాతబస్తీ అంటేనే పేదరికానికి చిరునామాగా కనిపిస్తుంటుంది. ఎవరో కొందరు ధనవంతులు తప్ప.. చాలా మంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడేవారే.. పాపం అలాంటి అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు బద్మాష్ గాళ్లు. విదేశాల్లో ఉద్యోగమిప్పిస్తామని మోసం చేస్తున్నారు. 

సౌదీ అరేబియాలో పని మనిషిగా చేసినా జీతం లక్షల్లో ఉంటుందని ఆశపెట్టి కొందరు మహిళలను మోసం చేసిన ఉదంతం పాతబస్తీలోని యాకుత్ పురా ప్రాంతంలో వెలుగు చూసింది. కొన్ని నెలల క్రితం పాతబస్తీలోనే ఉండే ఓ బ్రోకర్.. విదేశీ ఉద్యోగాల పేరుతో కొందరు మహిళలను సౌదీపంపించాడు.

తీరా.. సౌదీ వెళ్లాక.. అక్కడ ఇళ్లల్లో పనితో పాటు అక్కడి అరబ్ షేకుల కోరికలు కూడా తీర్చాలన్న సంగతి ఆలస్యంగా వారికి తెలిసింది. దేశం కాని దేశంలో తమ గోడు ఎవరికీ చెప్పుకోలేక.. ఇళ్లకు ఫోన్ చేసి బాధలు చెప్పుకున్నారు. దాంతో అవాక్కయ్యిన సదరు మహిళలు కుటుంబ సభ్యులు తమవారిని ఎలాగైనా ఆ మురికికూపం నుంచి బయటపడేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. 

ఫిర్యాదు నమోదు చేసుకున్న సౌత్ జోన్ పోలీసులు.. తమ బృందాలను విదేశాలకు పంపే పనిలో ఉన్నారు. సౌదీతో పాటు ముంబైలోనూ ఈ ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలున్నాయని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: