ఒక సామాన్య రైతు తన దేశ విస్తీర్ణం పెంచి ఇతర దేశం యొక్క విస్తీర్ణం తగ్గించినా కూడా ఎటువంటి యుద్ధం గాని, గొడవలు గాని, దండయాత్రలు గాని ఆందోళనలు గానీ జరగలేదు. విస్తీర్ణం కోల్పోయిన దేశం తీవ్ర ఆగ్రహం చూపించి బోర్డర్ వార్ కి తెర లేపాలి కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. వాస్తవానికి విస్తీర్ణం కోల్పోయిన దేశం నవ్వుతూ తమ బోర్డర్ సమస్యను చాలా సామరస్యంగా పరిష్కరించేందుకు సిద్ధమయ్యింది.

అయితే ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఎటువంటి యుద్ధాలు జరగకపోవడానికి కారణం ఆ రెండు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యమే అని చెబుతున్నారు. 



అసలేం జరిగిందో తెలుసుకుంటే.. బెల్జియంకు చెందిన ఓ సామాన్య రైతు తాను ట్రాక్టర్‌ నడిపే మార్గంలో ఓ రాయి అడ్డుగా వస్తుందని.. దానిని అక్కడి నుంచి తీసేసి 7.5 అడుగుల దూరంలో పాతి పెట్టాడు. దీనితో బెల్జియం దేశ విస్తీర్ణం అంతకు ముందు కన్నా దాదాపు 1,000 చదరపు మీటర్లు పెద్దది అయింది. మరోవైపు బెల్జియం దేశానికి పక్కనే ఉన్న ఫ్రాన్స్ దాదాపు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కోల్పోయింది.




అయితే ఒక స్థానిక చరిత్ర ఓత్సాహికుడు సరిహద్దు వెంబడి నడుస్తూ ఒక సరిహద్దు రాయి 7.5 అడుగులకు ఫ్రాన్స్ వైపు గా జరిగిందని గుర్తించారు. దీనితో ఈ విషయంలో రెండు దేశాల దృష్టికి వెళ్లగా.. దీనిని అంతర్జాతీయ స్థాయిలో రచ్చ చేసేందుకు రెండు దేశాలు ఆసక్తి చూపలేదు. బదులుగా ఈ సమస్యను చాలా సామరస్యంగా పరిష్కరించేందుకు సిద్ధమయ్యాయి.



ఐతే బెల్జియంలోని ఎర్‌క్వెలిన్నెస్ పట్టణం లో నివసించే ఓ రైతు తెలియక చేసిన పొరపాటు కారణంగా ఫ్రాన్స్‌లోని బౌసిగ్నీస్-సుర్-రాక్ అనే గ్రామం విస్తీర్ణం తగ్గిపోయిందని ఎర్‌క్వెలిన్నెస్ పట్టణ మేయర్ డేవిడ్ లవాక్స్ మంగళవారం రోజు మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. రైతు జరిపిన సరిహద్దు రాయి అంతకుముందు ఖచ్చితంగా ఎక్కడ ఉందో తమకు తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు.



ఫ్రాన్స్, బెల్జియం దేశాల మధ్య ఉన్న సరిహద్దు 620 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వాటర్ లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయిన తర్వాత 1989లో ఫ్రాన్స్ బెల్జియం మధ్య సరిహద్దు రాళ్లను పాతారు. 2019 నాటికి ఈ రాళ్ళు వేసి 200 సంవత్సరాల నిండగా 200 వార్షికోత్సవం సందర్భంగా.. సరిహద్దు రాళ్లను చాలా కచ్చితంగా జియోలోకలైజ్ చేశామని డేవిడ్ లవాక్స్ చెప్పుకొచ్చారు. ఏది పెద్ద విషయమేమీ కాదని.. ప్రస్తుతం ఇరుదేశాలు సరిహద్దు రాయిని యథాతథ స్థితికి చేర్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన మీడియాకు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: