తమిళనాడు ముఖ్యమంత్రి
స్టాలిన్ వచ్చీ రాగానే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా తమిళనాడు డీజీపీగా ఐపీఎస్ ఆఫీసర్ కుందస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇయితే ఇప్పుడు డీజీపీ నియామకమే వివాదాస్పదమైంది. కందస్వామి 2010లో
అమిత్ షాను
అరెస్ట్ చేశారు. ప్రస్తుతం
కేంద్ర హోం మంత్రిగా ఉన్న
అమిత్ షా అప్పట్లో గుజరాత్ హోం మంత్రిగా వ్యవహరించారు. అయితే సొహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ లో
అమిత్ షా ను కందస్వామి అరెస్టు చేశారు. కానీ కోర్టు మాత్రం
అమిత్ షా పై వస్తున్న ఆరోపణలను కొట్టి పారేసింది. ఇక ఇప్పుడు
అమిత్ షాను
అరెస్ట్ చేసిన కందస్వామి ని తమిళనాడు ప్రభుత్వం విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్, డీజీపీగా నియమించడం ద్వారా దూకుడును ప్రదర్శించింది. తమ నిర్ణయంతో కమలంతో కుస్తీకి రెడీ అన్నట్టుగా సంకేతాలిచ్చింది. అంతే కాకుండా
స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో పదే పదే తాము అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన అన్నా డీఎంకే మంత్రులను జైలుకు పంపుతామని చెప్పారు.
అంతే కాకుండా మొన్నటిదాకా సీఎంగా ఉన్న ఎడప్పాటి పళనిస్వామి మరియు ఆయన మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తూ డీఎంకే నేతలు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు ఎన్నో కంప్లైంట్ లు చేశారు. కానీ గవర్నర్ పట్టించుకోలేదు. విజిలెన్స్ విభాగానికి కంప్లైంట్ చేసినా వారు కూడా పట్టించుకోలేదు. అయితే గవర్నర్ కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారిని...కేంద్రంలో ఉన్న బీజీపీతో అన్నా డీఎంకే కు మంచి సంబంధాలుండటంతో కంప్లైంట్ లు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది డీఎంకే కాబట్టి లెక్క తేలుస్తారని
పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కందస్వామి గతంలో సీబీఐలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్
పోలీస్ గా చేశారు. మరోవైపు కేరళలో SNC-లావాలిన్ స్కామ్‌లో పినరయ్ విజయన్‌ని దర్యాప్తు చేశారు. ఇలా మంచి ట్రాక్ రికార్డు ఉన్న కందస్వామి అన్నా డీఎంకే మంత్రులపై ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తుంది.