ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతూ అన్ని రాష్ట్రాలకు  స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఈ మహమ్మారి కరోనా కాటుకు ఎంతోమంది బలైపోయారు. ఇలా చనిపోయిన తల్లితండ్రుల పిల్లలు అనాధలైపోయారు. వీరు ఏమిచేయాలో తెలియక అయోమయస్థితిలో ఉన్నారు. సీఎం నిర్ణయంతో వీరికి జీవితంపై ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. తాజా నిర్ణయంతో అనాధలుగా మిగిలిపోయిన ఎంతోమంది పిల్లలకు బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి వసతి కల్పించనున్నారు. దీని కోసం రాష్ట్రంలో కొన్ని ప్రదేశాలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది.  ఏపీలో ఉన్న మొత్తం జిల్లాలలో విడివిడిగా 31 కేంద్రాలను సిద్ధం చేశారు. వీరికి ఉండడానికి అవసరమయిన అన్ని రకాల వసతులను సమకూర్చనున్నారు. ఇప్పటికే సర్వస్వం కోల్పోయిన ఈ చిన్నారులకు కొత్త జీవితాన్ని ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఈ పిల్లల తల్లితండ్రులు చనిపోయే ముందు వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఎంతో కుమిలిపోయి ఉంటారు. ఈ విషయం గురించి తెలిసిన వారి ఆత్మలు సంతోషిస్తూ ఉండొచ్చు. ప్రభుత్వం ఏమిచేసినా తల్లితండ్రులు లేని లోటును మాత్రం పూడ్చలేరు. ఇది ఇలా ఉంటే ఆ సంక్షేమ కేంద్రాల వివరాలను చూస్తే, శ్రీకాకుళం జిల్లాలోని శాంత కల్యాణ అనురాగ నిలయంలో వసతిని ఏర్పాటు చేసింది. ఇక్కడ బాలురు మరియు బాలికలకు విడి విడిగా వసతి గృహాలను ఏర్పాటు చేశారు. అలాగే విజయనగరం జిల్లాలో బాలురి కోసం బ్రైట్ ఫ్యూచర్ రెయిన్బో చిల్డ్రన్ హోమ్, బొబ్బిలి మండలం కారాడలో బాలికల కోసం సన్రైజ్ చిల్డ్రన్ హోమ్ ఏర్పాటు చేయడం జరిగింది.  అలాగే విశాఖ జిల్లా భీమిలి మండలం నేరేళ్ళ వలసలో బాలికల కోసం ఎన్ ఓ ఎస్ చిల్డ్రన్ విలేజ్ ఆఫ్ ఇండియా, బాలురి కోసం మధురవాడ దగ్గర పోర్టు కాలనీలోని అరుణోదయ చిల్డ్రన్ హోమ్ సిద్ధం చేశారు. మరియు తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ లో బాలికల కోసం మిషన్ ఆఫ్ గ్రేస్, బాలురి కోసం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ సమీపంలోని ఏకలవ్య చిల్డ్రన్ హోమ్ ఏర్పాటు చేశారు. 

వెస్ట్ గోదావరి నరసాపురంలో బాలురు మరియు బాలికల కోసం విడి విడిగా బెతెస్త చిల్డ్రన్ హోమ్, పెంటపాడు మండలం రేచర్లలో బాలురి కోసం ప్రత్యేకంగా స్వాభిమాన్ చిల్డ్రన్ హోమ్ లో వసతి ఏర్పాటు చేశారు. అలాగే బాలికల కోసం కొవ్వూరులోని మదర్ తెరెసా షెల్టర్ హోమ్ సిద్ధం చేశారు. కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరులో బాలురి కోసం వీల్ పారడైజ్ చిల్డ్రన్ హోమ్, మచిలీపట్నంలో బాలురు మరియు బాలికల కోసం విడివిడిగా బెరకా చిల్డ్రన్ హోమ్, విజయవాడలో బాలురు కోసం మ్యాంగో చిల్డ్రన్ హోమ్, గుంటూరు జిల్లా ఫిరంగిపురం బాలికల కోసం కార్గ్స్. గుంటూరులోని బాలురు కోసం వెంకటేశ్వర మహిళా మండలి, తాడేపల్లిలో బాలురు బాలికల కోసం చిగురు, ఇదే జిల్లా మాచర్లలో బాలురు కోసం స్వామి వివేకానంద స్టూడెంట్స్ హోమ్ ఇలా రాష్ట్రంలో జిల్లాలవారీగా సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా ఈ విధంగా అనాధలుగా ఉన్న పిల్లల వివరాలను ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1811098 కి కాల్ చేసి చెప్పవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: