ఆడవాళ్లు తలుచుకుంటే ఏదన్నా సాధించగలరు అనడానికి ఈ మహిళ ఒక ఉదాహరణ అని చెప్పాలి. ప్రస్తుతం ఆడవాళ్లు సాదించలేనిది ఏది లేదంటూ ప్రతి రంగంలోనూ దూసుకుని పోతున్నారు. మగాళ్లతో పాటు పోటీగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యి ఉండేవాళ్లు. ఇంట్లో ఉంటూ కుటుంభ బాధ్యతలు నిర్వహిస్తు వంట గదికే పరిమితం అయిపోయేవారు. కానీ ఈ ఆధునిక కాలంలో మహిళలు ప్రతీరంగంలోనూ ముందు ఉంటున్నారు. ఉద్యోగాలు చేస్తూ కుటుంబ బాధ్యతలు సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాంటి మహిళల్ని చూసి ప్రతీ ఒక్కరూ అభినందించాలి. అలా ప్రతీ రంగంలోనూ ముందడుగు వేస్తున్న ప్రతి నారి మణులను ప్రోత్సహించాలిసిన బాధ్యత మన అందరి మీద ఉంది.ఈ క్రమంలో ఒక మహిళ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.



ఈమె చేసిన విన్యాసాలు చూస్తే మగాళ్లకు ఏమాత్రం తీసిపోదు ఈ లేడీ అంటారు.ఏకంగా  బుల్లెట్ బండి, ట్రాక్టర్, బస్సు ఇలా ప్రతి దాన్ని ఎంతో ఈజీగా నడిపిస్తుంది. అంతేకాదండోయ్ చీరకట్టులో గుర్రపు స్వారీ కూడా చేస్తుంది.ఇంతకీ ఆ మహిళ ఎవరా అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే






 ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా జాహల్ గ్రామానికి చెందిన మోనాలిసా అనే మహిళ సంప్రదాయ పద్దతిలో చక్కగా  చీరకట్టుకుని మరి  బుల్లెట్‌పై తిరుగుతూ, ట్రాక్టర్ తోలుతూ, గుర్రంపై స్వారీ చేస్తుంది.ఆమె చేసిన ఈ వీడియోల వలన  యూట్యూబ్‌లో మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను సొంతం చేసుకుంది. విభిన్నమైన  వీడియోలతో వీక్షకుల మనసులు గెలుచుకుంటోంది. మోనాలిసా ఇలా చేయడానికి తన భర్త బద్రి నారాయణ్ కూడా కారణమని తెలిపింది. తన భర్త ప్రోత్సహంతోనే నేను ఇలా ఇవన్నీ చేయగలుగుతున్న అని తేలిపారు. మోనాలిసా భద్రా 2016లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం 2.26 మిలియన్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. మోనాలిసా భర్త బద్రి నారాయణ్ క్రియేటివ్ డైరెక్టర్, సామాజిక కార్యకర్త కూడా. తన భర్తే తనకు యూట్యూబ్ చానల్‌ను పరిచయం చేసారని, ఇప్పుడు ఈ యూ ట్యూబ్ వలన తనకు ఉపాధి లబిస్తుందని  మోనాలిసా చెబుతున్నారు. ఇంకో విశేషం ఏంటంటే మోనాలిసాకు జంతువులంటే కూడా బాగా ఇష్టమట. !



మరింత సమాచారం తెలుసుకోండి: