ఆంధ్రప్రదేశ్ లో 6 శాతానికి కరోనా కేసులు పడిపోయాయి.ఇక రికవరీ శాతం కూడా 94 కి పడిపోయింది. రోజు రోజుకి కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం కొంచెం ఊరట కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే రోజూవారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది.కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం 96,153 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం 5741 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,20,134కు చేరింది.ఇక ఇందులో 75,134 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక నిన్న 10,567 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో.. కరోనా రికవరీ కేసుల సంఖ్య 17,32,948కి చేరింది. అలాగే గత 24 గంటల్లో మరో 53 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.అత్యధికంగా చిత్తూరు లో 12 మంది చనిపోయారు.దీనితో ఇప్పటిదాకా కరోనా మహమ్మారితో మృతి చెందినవారి సంఖ్య 12,052కి చేరుకుంది.


ఇక నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు చూసుకున్నట్లయితే .. అనంతపురం జిల్లాలో 353 మంది, చిత్తూరు జిల్లాలో 830 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 831 మంది, గుంటూరు జిల్లాలో 385 మంది, కడప జిల్లాలో 325 మంది, కృష్ణా జిల్లాలో 463 మంది, కర్నూలు జిల్లాలో 130 మంది , నెల్లూరు జిల్లాలో 266 మంది, ప్రకాశం జిల్లాలో 463 మంది , శ్రీకాకుళం జిల్లాలో 428 మంది , విశాఖపట్నం జిల్లాలో 339 మంది , విజయనగరం జిల్లాలో 225, పశ్చిమ గోదావరి జిల్లాలో 703 మంది కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.ఇక ఆంధ్ర రాష్ట్రంలో రెండు జిల్లాలు రెండు ల‌క్షల‌కు పైగా కరోనా కేసులు న‌మోదు చేయ‌గా.. మ‌రో 9 జిల్లాలు ల‌క్షకు పైగా కరోనా కేసులు న‌మోదు చేశాయి.ఇక కేవ‌లం రెండు జిల్లాల్లో మాత్రమే లక్ష లోపు కరోనా కేసులు న‌మోద‌య్యాయి.ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క‌రోనా నుండి ఊపిరి పీల్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: