గత కొన్ని రోజుల నుండి తెలంగాణ రాజకీయాల్లో ఈటల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈటెలను తెలంగాణ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి నప్పుడు నుంచి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.  చివరికి అందరూ ఊహించినట్టుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  బిజెపి పెద్దలైన జేపీ నడ్డా, ప్రధాని మోదీ లేదా అమిత్ షా సమక్షం లో బీజేపీలో చేరతారని అందరూ అనుకున్నారు.  కానీ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షం లో బిజెపి కండువా కప్పుకున్నారు ఈటెల రాజేందర్.



 ఇప్పటికే ఈటెల పై విరుచుకు పడుతున్న టిఆర్ఎస్ నేతలు.. ఇక ఇటీవల ఈ విషయాన్ని కూడా తెర మీదికి తెచ్చి విమర్శలు చేస్తున్నారు.  ఇక ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో బిజెపి కండువా కప్పుకోవడం పై గంగుల కమలాకర్ స్పందించారు. తనదైన శైలి లో  సెటైరికల్ విమర్శలు చేశారు గంగుల కమలాకర్. ఈటెల పోయి పోయి ఎవరికీ తెలియని ధర్మేంద్ర ప్రధాన్ సమక్షం లో బిజెపి కండువా కప్పుకున్నారు.  చివరికి బండి తో సంజయ్ బీజేపీ కండువా కప్పించుకున్న బాగుండేదేమో అంటూ సెటైర్ వేశారు.



 ధర్మేంద్ర ప్రధాన్ తో  కండువా కప్పించు కోవడానికి  ఇక స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాలా.. ఏమైనా స్పెషల్ ఫ్లైట్ కోసం ఈటెల ఎన్ని కోళ్లు అమ్మాడో  అంటూ సెటైర్ల తో విరుచుకు పడ్డాడు గంగుల కమలాకర్.  ఈటెల ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ హుజురాబాద్లో అభివృద్ధి మాత్రం ఏమీ జరగ లేదు అంటూ వ్యాఖ్యానించారు. కనీసం తన నియోజక వర్గ ప్రజలకు తాగునీరు అందించ లేదు అంటూ విమర్శించారు. పెట్రోలియం శాఖ మంత్రి సమక్షం లో బిజెపిలో చేరిన  బీజేపీ  ఈటల పెట్రోల్ ధరలు తగ్గిస్తారేమో అంటూ సెటైర్ వేశారు మంత్రి గంగుల కమలాకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: