ఇండియా మరియు పాకిస్తాన్ కి మధ్యన ఉన్న వైరం గురించి తెలిసిందే. పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉంటుంది వ్యవహారం. ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఇండియన్స్ పాకిస్తాన్ గురించి ఏ వ్యాఖ్యలు చేయకపోయినా, కావాలనే పాకిస్థాన్ రెచ్చగొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యుద్ధ సమయాలలో కూడా పాకిస్థాన్ సైనికులు ఇండియన్స్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. అంతే కాకుండా పాకిస్తాన్ సైనికులకు ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే ఇండియన్ ఫిమేల్ ఫిల్మీ స్టార్స్ ను అవహేళన చేస్తుంటారు. అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ప్రముఖ హిందీ హీరోయిన్ లు మాధురీ దీక్షిత్ మరియు రవీనా టాండన్ లపై కూడా కామెంట్ చేశారు.
ఆ టైమ్ లో వీళ్ళు హీరోయిన్ లుగా మంచి పీక్ స్టేజ్ లో ఉన్నారు.  అయితే పాకిస్థాన్ సైనికులు వీరిపై చేసిన కామెంట్ లకు ఇండియన్ సైనికులు కూడా సరిగ్గా రిప్లై ఇచ్చారు. ఐఏఎఫ్ విమానంపై ఓ డైలాగును రాయడం ద్వారా వారిపై ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పవచ్చు.  అయితే ఈ డైలాగు కూడా కామెడీ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డైలాగులో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును ప్రస్తావిస్తూ రాయడమే కారణం. అయితే ఈ మెసేజ్ లో నవాజుద్దీన్ షరీఫ్ పేరును రాయడానికి కూడా ఒక కారణం ఉంది.

 
కార్గిల్ యుద్దానికి ముందు ఒకసారి పాక్ ప్రధాని నవాజుద్దీన్ షరీఫ్ భారత్ పర్యటనకు వెళ్లడం జరిగింది. ఆ పర్యటనలో రవీనా టాండన్ అంటే నాకు చాలా అభిమానమని తెలిపారు. అందుకే భారత సైనికులు కార్గిల్ వార్ సమయంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ మీద హార్ట్ సింబల్ వేసి రవీనా టాండన్ నుండి నవాజ్ కు బహుమతి గా పంపారు.






మరింత సమాచారం తెలుసుకోండి: