
2019-20 లో వైసీపీ ప్రభుత్వం 57 సార్లు ఓవర్ డ్రాప్ట్‌కు వెళ్లారు అని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మూలధన వ్యయం కన్నా చెల్లిస్తున్న అప్పుల రీ-పేమెంటే ఎక్కువ అని విమర్శలు చేసారు. జగన్ తన రెండేళ్ల పాలనలో పారిశ్రామిక రంగంలో -5.2, సేవల రంగంలో -7.04, తలసరి ఆదాయంలో -6.6, జి.ఎస్.డి.పి లో -6.2 లు నమోదై నెగెటివ్ గ్రోత్ రేట్‌లతో రాష్ట్ర ఆర్ధిక వృద్ధిని భ్రష్టు పట్టించారు అని మండిపడ్డారు. 2021-22 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో రూ. 22,427.76 కోట్లు అప్పులు చేశారు అని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు.
2018-19 లో రూ.13899.07 కోట్ల రెవెన్యూ లోటు 2020-21 లో రూ. 35540.44 కోట్లకు చేరుకుంది అన్నారు. అన్ని రంగాల్లో జీరో అభివృద్ధి నమోదౌతోంది అని ఆయన తెలిపారు. రెండేళ్ల జగన్ పాలనలో నిరుద్యోగం 15 శాతంకు చేరింది అన్నారు ఆయన. నేరాలు-ఘోరాల్లో వంద శాతం వృద్ధి సాధించారు జగన్‌అని ఈ సందర్భంగా ఆరోపించారు. జగన్ రెడ్డి అనుభవ రాహిత్యంతో, అహంభావంతో, కక్షసాధింపు విధ్వంసక విధానాలతో, మితిమీరిన లూటీతో, దుబారాతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు అని మండిపడ్డారు. చాలా రోజుల తర్వాత యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు.