
ఇక తన మాటకు విలువ లేకపోతే పార్టీ వదిలిపెట్టడానికి సిద్ధమే అని బుచ్చయ్య బాగానే హడావిడి చేశారు. దీంతో చంద్రబాబు కిందకు దిగి వచ్చి బుచ్చయ్యని బుజ్జగించే కార్యక్రమం చేశారు. మిగిలిన నాయకులు సైతం బుచ్చయ్యకు మద్ధతుగా నిలిచారు. ఇక బుచ్చయ్యకు చంద్రబాబు సమయం ఇచ్చారు. అలాగే బుచ్చయ్య అన్నీ విషయాలని బాబుతో మాట్లాడారు. ఆ తర్వాతే బుచ్చయ్య పార్టీలో మళ్ళీ దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు.
అయితే తాజాగా బుచ్చయ్య మాదిరిగానే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలని నాయకులు పట్టించుకోవడం లేదని టిడిపి నేతల సమావేశంలో మాట్లాడారు. అలాగే అనంతపురం జిల్లాలో ఇద్దరు టిడిపి నాయకుల వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని మాట్లాడారు. ఇలా జేసి మాట్లాడటంపై సొంత పార్టీ నేతల నుంచి ఆయనకు సపోర్ట్ ఏమి రాలేదు. పైగా ఆయనపై రివర్స్‌లో విమర్శలు వచ్చాయి. అనంత టిడిపి నేతలు వరుసపెట్టి జేసి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అటు చంద్రబాబు సైతం జేసితో మాట్లాడలేదని తెలిసింది.
అసలు జేసి మాట్లాడక వరుసపెట్టి అనంత టిడిపి నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ జేసిపై ఫైర్ అయ్యారు. అయితే ఇదంతా బాబుకు తెలియకుండా జరిగి ఉండదని జేసి అనుచరులు భావిస్తున్నారు. ఇదంతా బాబు డైరక్షన్‌లోనే జరిగిందని, జేసిని కావాలనే టార్గెట్ చేశారని అనుకుంటున్నారు.