టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. 40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశాను అంటూ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదు అన్నారు ఆయన. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారు అని ఆయన విమర్శలు చేసారు. ఆర్గనైజ్డుగా ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారు అని ఆయన విమర్శించారు. పార్టీ కార్యాలయల పైనా దాడులు ఎప్పుడూ జరగలేదు అన్నారు చంద్రబాబు. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారు అని విమర్శించారు.

డీజీపీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు అని గవర్నరుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు.. పరిస్థితి వివరించాను అని అన్నారు. డీజీపీకి.. సీఎంకు తెలిసే ఈ దాడి జరిగింది అని ఆయన విమర్శించారు. డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారింది అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కోరల నుంచి బయటపడేయాలని కోరడం మా తప్పా..? అని ఆయన నిలదీశారు. ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే మేం ప్రశ్నించకూడదా..? అని నిలదీశారు.

స్టేట్ టెర్రరిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ కు పిలుపిస్తున్నాం అన్నారు చంద్రబాబు. పార్టీ కార్యాలయాలపై దాడి చేసి చంపేయాలని చూస్తారా..? అని ఆయన ఫైర్ అయ్యారు. పులివెందుల రాజకీయాలు చేస్తారా..? పార్టీ కార్యాలయంపై దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తోంటే డీజీపీ ఎక్కడ పడుకున్నారు...? డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది టీడీపీకి సంబంధించిన విషయం కాదు.. ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం అన్నారు ఆయన. పార్టీ కార్యాలయం పైనా.. నేతల పైనా దాడులు జరిగితే.. ప్రజాస్వామ్యం ఎక్కడిది..?అంటూ మండిపడ్డారు. శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి అన్నారు చంద్రబాబు. డీజీపీ కార్యాలయం పక్కన దాడులు చేస్తే ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయకూడదు..?అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp