బోషడీకే.. ఇప్పుడు ఈ పదం ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి ఈ బోషడీకే పదం వాడటంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడింది. ఈ  బోషడీకే పదం వాడినందుకే ఇప్పుడు ఏపీలో రాజకీయ సునామీ వచ్చింది. ఈ బోషడీకే పదం వాడినందుకే ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ పదం వాడినందుకే పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. ఈ పదం వాడినందుకే మా ఫ్యాన్స్‌కు బీపీ రాదా అని సీఎం జగన్ ప్రశ్నించారు. మరి ఇన్నిఅనర్థాలకు కారణమైన అసలు ఈ బోషడీకే అంటే అర్థం ఏంటి..?


ఇప్పుడు చాలామందికి వచ్చిన అనుమానం ఇదే.. అసలు బోషడీకే అంటే ఏంటి..? అసలు ఇది ఏ భాష పదం.. తెలుగా.. ఇంగ్లీషా.. హిందీనా.. ఇంకా ఏదైనా భాషనా.. అసలు దీన్ని ఎందుకు వాడతారు.. ఈ తిట్టు బూతా.. కాదా.. ఇలా ఈ బోషడీకే పదంపై చర్చోపచర్చలు జరిగాయి. సాధారణంగా ఈపదాన్ని సాఫ్ట్ బూతుగా వాడుతుంటారు. పిల్లలను ఎక్కువగా బోషడీకే అంటం వింటుంటాం. కానీ.. ఈ పదం గురించి సాధికారికంగా వివరించిన వారు ఇద్దరు ఉన్నారు.


వారిలో ఒకరు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. నిన్న ఆయన మీడియా ముందుకు వచ్చి.. బోషడీకే అంటే పెద్ద తిట్టేమీ కాదు.. బావున్నారా అని అడగటం అంటూ కొత్త అర్థం చెప్పుకొచ్చారు. "భోసి డీ కే" అనేది అపవిత్రమైన బూతుమాట కాదని, పవిత్రమైన సంస్కృత వాక్యమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెబుతున్నారు. దీనికి ఆధారంగా ఎవరో రాసి నెట్లో పెట్టిన ఒక వ్యాసాన్ని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చూపించారు.

ఆ వ్యాసం ప్రకారం "భో!" అంటే సంస్కృతంలో "హెలో" లాంటి సంబోధన అట. "సద్" అంటే "మంచి"అట.. "ఇకే" అంటే "ఉన్నది" అట.. అంటే.. "భో! సద్ ఇకే" అంటే "హెలో! మంచిగుంది" అని అర్థం చేసుకోవాలట. అంతే కాదండోయ్.. ఈ పదాన్ని మొగలాయిలు భారతదేశాన్ని ఆక్రమించుకునే వరకు దేశంలోని అంతా బాగా వాడేవారట. అయితే నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం బోషడీకే అంటే పచ్చి బూతు అంటూ ఆ బూతు అర్థం కూడా చెప్పేశారు. లం.. కొడక అనే అర్థం వస్తుందని ఆయన చెప్పారు. ఇదీ బోషడీకే కథాకమామీషు.

మరింత సమాచారం తెలుసుకోండి: