
గత ఎన్నికల్లోనే కుప్పంలో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచిన చంద్రబాబు ఈ సారి మున్సిపాల్టీ పై అయినా టీడీపీ జెండా ఎగర వేసుకోక పోతే పరువు పోతుందని భావించి రాష్ట్ర స్థాయిలో కీలక నేతలను అందరిని అక్కడే మోహరించేశారు. ఈ క్రమంలోనే కుప్పంలో ఎవరు గెలుస్తారు అనే దానిపై అక్కడ కొన్ని సంస్థలు సర్వేలు కూడా చేస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ఏజెన్సీ అనే సంస్ధ జనాల అభిప్రాయాలను సేకరించగా వైసీపీ గెలుపు పక్కా అని తేలిందట.
మొత్తం 25 వార్డుల్లో 8 వేల మంది అభిప్రాయాలు ఈ సంస్థ సేకరించింద ట. మొత్తం 25 వార్డు ల్లో వైసీపీ 14 చోట్ల గెలవబోతోందట. టీడీపీ 4 వార్డుల్లో గెలిస్తే.. మరో 7 వార్డుల్లో పోటీ చాలా టఫ్ ఫైట్ ఉందట. ఈ మున్సిపాల్టీ పరిధిలోనే జగన్ పాలనపై ఏకంగా 62. 37 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని చెప్పారట. 14 సంవత్సరాలు సీఎం... పైగా కుప్పం నుంచే దాదాపు 32 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలాకాలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతకు ఈ స్థాయిలో మార్కులు రావడం మామూలు విషయం కాదు.
మరి చంద్రబాబు కనీసం ఈ మున్సిపాల్టీ అయినా గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కేడర్‌లో కొంతైనా జోష్ కనిపిస్తుందనే చెప్పాలి. లేదంటే బాబు కు వచ్చే ఎన్నికలు కూడా కష్టంగానే ఉంటాయి.