ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజధాని కేసు గురించి వాదనలు కొనసాగుతున్నాయి. అయితే మొదటి రెండు మూడు రోజులు హైకోర్టు జడ్జిలు రాజధానికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యలతో రాజధాని రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. తమకు కోర్టుల్లో న్యాయం జరుగుతుందని.. అమరావతి ఎక్కడి వెళ్లదని వారు బలంగా నమ్ముతున్నారు. కోర్టులు తప్పకుండా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తాయని.. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటిస్తాయని నమ్మకంతో ఉన్నారు.
అయితే.. విచారణ నాలుగో రోజు హైకోర్టులో జడ్జిలు మాట్లాడిన మాటలు వారిని నీరు గార్చాయి. అవును.. అసలు తాము రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడం లేదని ఏకంగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడంతో రైతుల తరపు న్యాయవాదులు అవాక్కయ్యారని చెప్పాలి. అయితే.. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల చట్టబద్దత పైనే తాము విచారణ జరుపుతున్నామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. అంటే.. రాజధాని మార్చడం, మార్చకపోవడం అన్నది తమ పరిధిలోని అంశం కాదని హైకోర్టు తేల్చి చెప్పిందన్నమాట.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంలో ఏదైనా రాజ్యాంగ విరుద్ధమైన అంశం ఉంటే హైకోర్టు తగిన చర్యలు తీసుకుంటుందని అర్థం చేసుకోవచు.. నాలుగోరోజు.. రాజధాని రైతుల తరపున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు నిర్ణయంపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి వ్యతిరేకించలేదని వారు వాదించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతి నిర్ణయాన్ని స్వాగతించారని... కావాలంటే వీడియోలు ప్రదర్శిస్తామని వీరు వాదించారు.
కానీ.. జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ 3 రాజధానులు నిర్ణయాన్ని చేశారని.. భూమి, నీరు, భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో ఉండటం వలనే అన్నిటికి అనుకూలమైన ప్రాంతంగా ఉండటం వలనే అమరావతిని ఎంపిక చేశారని ఈ లాయర్లు వాదించారు. మెజారిటీ ప్రజలు రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పిందని లాయర్లు వాదించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి