హుజురాబాద్ గెలుపుతో ఊపు మీద ఉన్న ఈటల రాజేందర్ కు కీలక టాస్క్ అప్పగించారా..? రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బిజెపి జాతీయ నేతలు ఈటెలతో రహస్యంగా సమావేశమై ఏం చర్చించారు..? ఈటెల చేపట్టబోయే కొత్త మిషన్ గురించి మంతనాలు జరిపారా.. ?తెలంగాణలో కాషాయ దళం కొత్త కొత్త సమీకరణలు ఆలోచన చేస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం శక్తిగా ఎదిగామని హైదరాబాద్ లో జరిగిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు. పవర్ లోకి రావాలంటే పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారట. ఇదే సందర్భంలో బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 అంతేకాదు ఈటల రాజేందర్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగించడం కూడా చర్చనీయాంశమైంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 24 మంది అగ్ర నేతలు తమతో టచ్లో ఉన్నారంటూ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ వ్యాఖ్యానించడం ఆసక్తి కలిగిస్తోంది. తమవద్ద 119 మంది అభ్యర్థులు ఉన్నారని వారిలో గెలిచే 70 మంది జాబితా కూడా సిద్ధంగా ఉందన్నారు తరుణ్ చుగ్. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని మీడియాతో జరిగిన చిట్ చాట్ తరుణ్ చుగ్ అన్నారు. బిజెపితో నిజంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా, లేదంటే మైండ్ గేమేనా..? అధికారంలోకి వచ్చేంత సత్తా కాషాయ దళానికి  ఉందా? తెలంగాణలో బిజెపి జోష్ మీద ఉన్నది మాత్రం నిజం. ఎందుకంటే వరుసగా గెలుస్తుంది, ఆందోళనలు చేస్తోంది.అయితే  ఈ బై పోల్ విక్టరీ ల కాన్ఫిడెన్స్ తో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు అంటున్నారు. ఆపరేషన్ కరీంనగర్ పై ఈటల కు దిశానిర్దేశం  చేసిందని తెలుస్తోంది. తాజాగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా తన అనుచరుడు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను రంగంలోకి దింపారు ఈటెల. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు.

 బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రెటరీ శివ ప్రకాష్ ఈటెల రాజేందర్ తో ప్రత్యేకంగా భేటీ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలను సైతం పక్కనపెట్టి ఈటెల తో మాట్లాడారు శివ ప్రకాష్. సమావేశ గది నుంచి హడావిడిగా బయటకు వచ్చి దూరంగా ఇద్దరు కూర్చొని మంతనాలు జరిపారు. ఇద్దరు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం బిజెపిలో చర్చనీయఅంశం అయ్యింది . టిఆర్ఎస్ లో చేపట్టవలసిన ఆపరేషన్ ఆకర్ష్ తో పాటు ఈటలకు అప్పగించిన స్పెషల్ మిషిన్ గురించి మాట్లాడినట్లు కొందరు చర్చించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: