వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రోజురోజుకు కమ్మ సామాజిక వర్గం లో కోపం నషాలానికి అంటుతోంది. గత ఎన్నికల్లో తాము చంద్రబాబును కాదని కూడా .. జగన్‌కు సపోర్ట్ చేశామని... అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక తమను రాజకీయంగా అణ‌గ దొక్కుతున్నా రంటూ వారు వాపోతున్నారు. జగన్ గత ఎన్నికల్లో కమ్మ వర్గం లో సీనియర్ గా ఉన్న మర్రి రాజశేఖర్ - రావి వెంకటరమణ లాంటి నేతలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేదు.

క్యాబినెట్ మొత్తం మీద ఒక్క కొడాలి నాని మాత్రమే క‌మ్మ వ‌ర్గం నుంచి మంత్రిగా ఉన్నారు. కొడాలి నాని ని కూడా కేవలం చంద్రబాబును తిట్టేందుకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చి పక్కన పెట్టుకున్నారు అన్న ఆరోపణలు ముందు నుంచి ఉన్నాయి. ఇక జగన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని... పదవుల పంపకాల్లో కూడా వారికి అన్యాయం చేస్తున్నారని విమర్శలు ఇటీవల ఎక్కువవుతున్నాయి.

పైగా తొలినుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు తీవ్రమైన అన్యాయం జరిగిందన్న భావన... కోస్తా ఆంధ్రాలో ఉన్న కమ్మ సామాజిక వర్గం అందరిలోనూ వినిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ పదవుల్లో ఊరూపేరూ లేని తలశిల రఘురాం - తూమాటి మాధవరావు లాంటి క‌మ్మ నేతలకు ఎమ్మెల్సీలు ఇచ్చిన జగన్ మర్రి రాజశేఖర్ ను పట్టించుకోకపోవడంతో కృష్ణా - గుంటూరు - గోదావరి - ప్రకాశం జిల్లాలో ఉన్న క‌మ్మ ల‌లో వైసిపి, జగన్ పై తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో కోస్తా ఆంధ్రాలో ఉన్న కమ్మలు ఏకమై వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు ఒకటి అవుతున్నారు. మరి జగన్ తాను మాట ఇచ్చిన మర్రి రాజశేఖర్ కు ఇప్పటికైనా న్యాయం చేస్తారా ? లేదా ... క‌మ్మ‌లు తనకు అవసరం లేదని లైట్ తీసుకుంటారా ? తన మాటను తుంగలో తొక్కేస్తారా ? అన్నది ఆయన విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: